టాలీవుడ్ లో ఏన్నో చిత్రాలు సైతం ఇప్పటివరకు విడుదల అవుతూనే ఉన్నాయి.. ముఖ్యంగా చిన్న చిత్రాలు కూడా విడుదలై ప్రేక్షకులను బాగా అలరిస్తూనే ఉన్నాయి. కొన్ని బడా చిత్రాలు కూడా పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించిన ఫ్లాప్ లుగా మిగిలి నష్టాలను చవి చేశాయి. అలా ఈ ఏడాది ఇప్పటివరకు విడుదలైన చిత్రాలలో ఎక్కువగా నష్టాలను మిగిల్చిన చిత్రాల గురించి ఇప్పుడు ఒకసారి మనం తెలుసుకుందాం.


హీరోయిన్ సమంత లేడీ ఓరియంటెడ్ చిత్రంగా నటించిన చిత్రం శాకుంతలం. ఈ చిత్రాన్ని డైరెక్టర్ గుణశేఖర్ ఎంతో అద్భుతంగా తెరకెక్కించారు. ఈ చిత్రం భారీ డిజాస్టర్ అయ్యింది..మరొక సినిమా అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా ఘోరమైన డిజాస్టర్ ని చవిచూసింది ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్ లోనే విడుదల కావడం జరిగింది. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. మరొక చిత్రం నాగచైతన్య, కృతి శెట్టి కలిసి నటించిన రెండో చిత్రం కస్టడీ.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ వెంకట ప్రభు తెరకెక్కించడం జరిగింది ఈ సినిమా కూడా ఘోరమైన డిజాస్టర్ గా నిలిచింది.


హీరో గోపీచంద్, డైరెక్టర్ శ్రీవాస్ దర్శకత్వం లో వచ్చిన చిత్రం రామబాణం ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాన్ని అందుకోవాలని ప్రయత్నం చేసిన ఫెయిల్యూర్ గా మిగిలింది.ఇందులో హీరోయిన్ గా డింపుల్ హయాతి నటించినది. హీరో రవితేజ డైరెక్టర్ సుధీర్ వర్మ దర్శకత్వంలో నటించిన చిత్రం రావణాసుడు.. ఈ చిత్రంలో దీక్ష నాగర్కర్, ఫరియా అబ్దుల్లా తదితరులు సైతం నటించడం జరిగింది. అయితే ఈ సినిమా కూడా భారీ అంచనాల మధ్య విడుదలవ్వగా ఘోరమైన ఫ్లాప్ గా మిగిలింది. దీంతో తమ తదుపరి చిత్రాలను సైతం సరైన కథలతో విడుదల చేయాలని పలు ప్రయత్నాలు చేస్తున్నారు. మరి ఈసారైనా సరైన సక్సెస్ను అందుకొని అభిమానులను నిరాశపరచకుండా చేస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: