నాగచైతన్య తో విడిపోవడం ఆతరువాత ఏర్పడిన అనారోగ్య సమస్యలు ఇలా అన్నిటితోను యుద్ధంచేసిన సమంత ఆపరిస్థితుల ప్రభావం నుండి తేరుకుని ప్రస్తుతం తన సినిమా కెరియర్ పై దృష్టి పెట్టింది. సైబీరియాలో తాను నటిస్తున్న వెబ్ సిరీస్ యాక్షన్ సన్నివేశాల షూటింగ్ కోసం అక్కడ బిజీగా ఉంటున్న సమంతకు సంబంధించిన ఒక ఆశక్తికర విషయం పై ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

 

 

కొంతమంది మీడియం రేంజ్ హీరోలు తమ సినిమాలకు సంబంధించి సమంతతో కలిసి నటించాలని అభిప్రాయంతో తమ మూవీ దర్శకులతో రాయబారాలు చేస్తున్నప్పటికీ ఆసినిమాలకు సంబంధించిన కథలు వినే విషయంలో పెద్దగా సమంత ఆశక్తికనపరచడం లేదు అంటూ గాసిప్స్ వస్తున్నాయి. అంతేకాదు ఆమె ఆసినిమాలలో హీరోయిన్ గా నటించే విషయంలో దర్శక నిర్మాతలకు చెపుతున్న పారితోషికం రేంజ్ విని ఆ నిర్మాతల మైండ్ బ్లాంక్ అవుతున్నట్లు టాక్.

 

 

అంతేకాదు సమంత తాను నటించే సినిమాలలో తన పాత్రకు మంచి ప్రాధాన్యత ఉండాలని అదేవిధంగా వీలైనంత వరకు హీరోయిన్ ఒరియేంటెడ్ కథలు ఉంటే తన దగ్గరకు తీసుకురమ్మని సమంత ఆయా దర్శక నిర్మాతలకు చెపుతోంది అని అంటున్నారు. దీనితో సమంత కావాలని ఇలా చేస్తోందా లేదంటే ఆమె వ్యూహాలలో ఏమైనా మార్పులు వచ్చాయా అన్న చర్చలు కూడ ఇండస్ట్రీ వర్గాలలో జరుగుతున్నాయి. గతంలో తాప్సీ ఇలియానా టాలీవుడ్ లో మంచి అవకాశాలు వస్తున్నప్పటికీ వాటిని వదులుకుని బాలీవుడ్ వైపు పరుగులు తీసి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దూరం అయ్యారు. దీనితో  సమంత తన  టాలీవుడ్  కరేయర్ కు  సంభంధించి  ఎటువంటి  వ్యూహాలు  అనుసరిస్తుంది  అన్న ఆసక్తి ఆమె అభిమానులతో  పాటు  ఇండస్ట్రి వర్గాలలో కూడా  చాలా ఉంది.  ఈ విషయం లో ఆమె  ఎలా వ్యహరిస్తుందో చూడాలి . ప్రస్తుతం ఆమె  వ్యూహాలు చాలా తెలివి గా ఉన్నాయి  అన్న కామెంట్స్  వస్తున్నాయి .

 

మరింత సమాచారం తెలుసుకోండి: