తెలుగు సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ఉన్న హీరోలు అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ... గోపీచంద్ ... పవన్ కళ్యాణ్ ... రామ్ పోతినేని ... అల్లు అర్జున్ సినిమాలు ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్నాయి. ప్రస్తుతం ఆ సినిమాల షూటింగ్ లు ఎక్కడ జరుగుతున్నాయి... ఆ మూవీ బృందాలు ప్రస్తుతం ఆ మూవీ లకు సంబంధించిన ఏ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.

జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ బృందం ఎన్టీఆర్ మరియు సైఫ్ ఆలీ ఖాన్ పై యాక్షన్స్ సన్నివేశాలను శంషాబాద్ పరిసర ప్రాంతాలలో చిత్రీకరిస్తుంది. ఈ మూవీ కి కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్నాడు.

మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రస్తుతం బీమా అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం గోపీచంద్ పై సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం "ఓజి" అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం ఈ సినిమాలో నటిస్తున్న ఇతర నటీనటులపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది. సుజిత్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది.

రామ్ పోతినేని ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ మైసూర్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం రామ్ ... శ్రీ లీల పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. రష్మిక మందన ఈ మూవీ లో హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... సుకుమార్మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ రామోజీ ఫిలిం సిటీ లో జరుగుతుంది. ఈ మూవీ బృందం ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీలో ఈ సినిమాకు సంబంధించిన అత్యంత కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: