మహానటి సినిమాతో టాలీవుడ్ లో మంచి పాపులారిటీ సంపాదించింది హీరోయిన్ కీర్తి సురేష్ అటు కోలీవుడ్ ప్రేక్షకులకు టాలీవుడ్ ప్రేక్షకులకు ఈ ముద్దుగుమ్మ మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఈ సినిమాతో ఉత్తమ నటిగా కూడా అవార్డు అందుకున్నది. తాజాగా కీర్తి సురేష్ కు సంబంధించి ఎప్పుడూ ఏదో ఒక విషయం వైరల్ గా మారుతూనే ఉంటుంది. ఇప్పుడు తాజాగా నటుడు నాగచైతన్య తో కలిసి మరొకసారి స్క్రీన్ ప్లే ని షేర్ చేసుకోబోతోందని వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. గతంలో వీరిద్దరూ కలసి మహానటి చిత్రంలో కలిసి నటించడం జరిగింది.


రీసెంట్గా నాగచైతన్య థాంక్యూ, కస్టడీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పెద్దగా సక్సెస్ కాలేకపోయారు. దీంతో ఈ చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలాయి. దీంతో డైరెక్టర్ చందు మొండేటి దర్శకత్వంలో నాగచైతన్య ఒక సినిమాలో నటించబోతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో గతంలో ప్రేమమ్ ,సవ్యసాచి వంటి సినిమాలు విడుదలయ్యాయి. ఇక హీరో నిఖిల్ తో కలిసి చందు మొండేటి కార్తికేయ-2 సినిమాతో మంచి బ్లాక్ బస్టర్ విజయాలను తెరకెక్కించారు. ఇదంతా అలా ఉంటే నాగచైతన్య మొదట గీత ఆర్ట్స్ బ్యానర్ పైన సరికొత్త డైరెక్టర్ తో సినిమా చేయాల్సి ఉండేదట.


అయితే నాగచైతన్యతో సినిమా చేసే విషయం ఆయన నిర్మాత అల్లు అరవింద్ డైరెక్టర్ చందు మొండేటిని ఒప్పించి ఈ సినిమాకు సంబంధించి ఫార్మాలిటీలను కూడా గత కొద్దిరోజుల క్రితం పూర్తి చేశారని వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం మేకర్స్ హీరోయిన్ ఎంపిక విషయంలో ఉండగా.. అనుపమాను ఫైనల్ చేశారని వార్తలు తెరపైకి వచ్చాయి కానీ తాజాగా కీర్తి సురేష్ పేరు కూడా వినిపిస్తోంది.. ప్రస్తుతం కీర్తి సురేష్ సక్సెస్ ట్రాక్ బాగా ఉండడంతో చైతన్యకు కూడా బాగా కలిసొస్తుందని చిత్ర బృందం భావించినట్లు తెలుస్తోంది మరి కీర్తి సురేష్ నాగచైతన్యత సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా లేదా అనే విషయంపై చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: