సాంబశివరావు దర్శకత్వంలో రాహుల్ రామకృష్ణ హీరోగా సీరియల్ నటి నవ్య స్వామి హీరోయిన్ గా ఇంటింటి రామాయణం అనే మూవీ రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా నుండి ఈ మూవీ బృందం ఈ మూవీ విడుదలకు ముందు విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై తెలుగు సినీ ప్రేమికుల పరవాలేదు అనే రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. అలా పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేక పోయింది.

దానితో ఈ సినిమాకు బాక్స్ ఆఫీస్ దగ్గర చెప్పుకోదగ్గ కలెక్షన్ లు కూడా రాలేదు. అలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశ పరిచిన ఈ సినిమా చాలా తక్కువ సమయంలోనే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటువంటి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ వారు దక్కించుకున్నారు. అందులో భాగంగా ఈ సినిమాను ప్రస్తుతం ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి వారు తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ కి "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుం ది.

ఎవరైనా ఈ సినిమాను థియేటర్ లలో చూద్దాం అని మిస్ అయిన వారు ఉంటే ప్రస్తుతం ఈ సినిమా ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుంది చూసి ఎంజాయ్ చేయండి.

మరింత సమాచారం తెలుసుకోండి: