తెలుగు సినీ పరిశ్రమలో నేడు దిల్ రాజ్ ఈ స్థానంలో ఉన్నారంటే అందుకు కారణం తను ఎంచుకున్న సినిమాల కథలు తనను ఈ స్థాయిలో ఉంచాయని చెప్పవచ్చు. తన బ్యానర్ నుంచి వచ్చిన సినిమా కానీ డిస్ట్రిబ్యూషన్ సినిమా అయినా సరే మంచి విజయాలను అందుకుంటు ఉంటాయి. ఇప్పుడు తాజాగా శంకర్ నిర్మిస్తున్న గేమ్ చేంజర్ అనే చిత్రానికి కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అయితే దిల్ రాజు పైన ఎవరు ఎలాంటి విమర్శలు చేసిన పెద్దగా పట్టించుకోరు కేవలం తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటారు.


మొదట డిస్ట్రిబ్యూటర్ గా తన కెరీర్ను ప్రారంభించి నిర్మాతగా ఎదిగారు. ఎంతోమంది అగ్ర హీరోల సినిమాలు పంపిణీ చేసిన ఘనత దిల్ రాజుకే దక్కింది. అలా పవన్ కళ్యాణ్ నటించిన తొలిప్రేమ సినిమా కూడా ఉన్నది ఈ సినిమా అప్పట్లో దిల్ రాజే పంపిణీ చేసినట్టుగా తెలుస్తోంది. త్వరలో ఈ సినిమా  రీ రిలీజ్ చేయబోతున్న తరుణంలో దిల్ రాజ్ పలు జ్ఞాపకాలను సైతం స్మరించుకున్నారు వాటి గురించి తెలుసుకుందాం.. ఈ సినిమాకి తన జీవితంలో ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది అప్పట్లో ఈ సినిమాని నేనే డిస్ట్రిబ్యూట్ చేశాను తన దగ్గర డబ్బులు చాలా తక్కువగా ఉన్నప్పుడల్లా ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేసేవాడిని ఈ సినిమా ప్రతి ఒక్కరికి ఎన్నో జ్ఞాపకాలు మిగిల్చిందని తెలిపారు.

ఇండస్ట్రీలో కొత్తగా ఈ చిత్రాన్ని డిస్ట్రిబ్యూటర్ గా చేశాను తన జీవితాన్ని ఒక పుస్తకంలో రాస్తే తొలిప్రేమ సినిమా ఒక పేజీగా ఉంటుందని తెలిపారు. ఇప్పటివరకు ఎన్నో అద్భుతమైన సినిమాలు తీసినప్పటికీ తొలిప్రేమ సినిమా తనకి ఎప్పటికీ ప్రత్యేకమే అని తెలిపారు. తొలిప్రేమ సినిమా 100వ రోజుని ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగింది.ఆ రోజు కూడా ప్రేక్షకులు ఈ సినిమాను చూసేందుకు సంధ్య థియేటర్ వద్ద బారులు తీరారు ఇలాంటివి జరగడం అన్నది ఒక చరిత్రని తెలిపారు. అయితే ఈ సినిమా కొన్నందుకు డిస్ట్రిబ్యూటర్ కు ఐదేళ్లపాటు రైట్స్ ఇచ్చారు అలా ఆ సినిమాని ఎన్నోసార్లు రిలీస్ చేసి కొంత ఆదాయాన్ని సంపాదించానని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: