ప్రస్తుత తరం సెలెబ్రెటీల కొడుకులు కూతుళ్ళు వారికి ఏరంగంలో అభిరుచి ఉంటే ఆరంగంలో సెటిల్ అవ్వడానికి చిన్నతనం నుండి కృషి చేస్తున్నారు. క్రియేటివ్ దర్శకుడుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పరుచుకున్న సుకుమార్ కూతురుకు సంగీతం పట్ల విపరీతమైన ఆశక్తి ఉంది. ఆ ఆశక్తి గ్రహించిన సుకుమార్ ఆమెను ఆరంగంలో ప్రోత్సాహిస్తున్నాడు.


భవిష్యత్ లో సంగీత దర్శకురాలిగా మారాలని ఆరాటపడుతున్న ఆమెను తీసుకుని ఈమధ్య సుకుమార్ అమెరికాకు వెళ్ళి అక్కడ ఒక ప్రముఖ మ్యూజిక్ యూనివర్సిటీలో ఒక కోర్సు చేయడానికి తీసుకు వెళ్ళినట్లు తెలుస్తోంది. ఆ కోర్సు ఫీజు మన ఇండియన్ కరెన్సీలో కోట్లాది రూపాయాలలో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. తన కూతురు అభిరుచి కోసం కోట్లు  ఖర్చు పెడుతున్నట్లు తెలుస్తోంది.


‘పుష్ప 2’ షూటింగ్ లో బిజీగా ఉన్న సుకుమార్ తన కూతురు కోసం షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి అమెరికా వెళ్ళినట్లు తెలుస్తోంది. ఈమధ్యనే ‘పుష్ప 2’ క్లైమాక్స్ సీన్స్ ను పూర్తి చేసిన సుకుమార్ ఈసినిమాకు సంబంధించిన పోష్టు ప్రొడక్షన్ పనుల పై దృష్టి పెట్టాడు. వాస్తవానికి ఈమూవీకి సంబంధించిన క్లైమాక్స్ ఘాట్ పూర్తి అయినప్పటికీ ఈ మూవీకి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాల షూటింగ్ ఇంకా పెండింగ్ లో ఉంది అంటున్నారు.


ప్రస్థుతం ‘పుష్ప 2’ కు దేశవ్యాప్తంగా ఏర్పడిన మ్యానియా రీత్యా ఈమూవీ మేకింగ్ లో ఎలాంటి పొరపాట్లు జరగ కూడదు అన్న ఉద్దేశ్యంతో ఈమూవీ విడుదల వచ్చే సంవత్సరం సమ్మర్ రేస్ లో ఉంటుంది అంటున్నారు. ‘పుష్ప’ మూవీ చివరిలో పార్ట్ 2 ఉంటుంది అని సుకుమార్ లీకులు ఇచ్చినట్లుగా ‘పుష్ప పార్ట్ 2’ ఎండింగ్ లో ఈమూవీ పార్ట్ 3 కి సంబంధించిన లీకులు ఉంటాయని అయితే ఈ సీక్వెల్ మరో రెండు సంవత్సరాలు తరువాత కానీ ప్రారంభం కాదని అందువల్లనే బన్నీ త్రివిక్రమ్ ల మూవీ ప్రకటన వచ్చింది అని అంటున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి: