ఇటీవల ఈ సినిమాకు సంబంధించి చిన్న టీజర్ విడుదల చేయగా.. ఈ టీజర్ సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టించింది అని చెప్పాలి. కాగా ఇక సలార్ సినిమాలో అటు జగపతిబాబు నెగటివ్ రోల్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు అంటూ ఇటీవల చిత్ర బృందం ప్రకటించింది. కాగా 1980 బ్యాక్ డ్రాప్ లో ఈ స్టోరీ ఉంటుందని.. సున్నపురాయి మాఫియా నేపథ్యంలో భారీ సన్నివేశాలతో కథ సాగుతుంది అన్నది తెలుస్తుంది. కాగా ఈ సినిమాలో డార్లింగ్ ప్రభాస్ సరసన శృతిహాసన్ నటిస్తుంది. కాగా జగపతిబాబుతో పాటు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలకపాత్రలో కనిపించబోతున్నారు అని చెప్పాలి.
ఇకపోతే ఇటీవలే సలార్ సినిమా గురించి ఒక షాకింగ్ సీక్రెట్ ని రివీల్ చేశారు జగపతిబాబు. సలార్ తొలి భాగంలో తనకు ఎలాంటి సన్నివేశాలు లేవు అంటూ స్పష్టం చేసాడు. ఫస్ట్ పార్ట్ లో తాను నటించిన పాత్ర కనిపించదు అంటూ తెలిపాడు. దీంతో ప్రభాస్ జగపతిబాబు నడుమ చిత్రీకరిస్తున్న సీన్స్ పార్ట్ 2 లోనే ఉంటాయి అనే రహస్యం బయటికి వచ్చినట్లు అయింది. దీంతో ఇక జగపతిబాబు నటన చూడాలి అనుకున్న అతని ఫ్యాన్స్ ఇక సలార్ సినిమాను కాస్త అవాయిడ్ చేసే ఛాన్స్ ఉంది అని చెప్పాలి. కాగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ,హిందీ భాషల్లో ఒకేసారి భారీ ఎత్తున ఈ సినిమాను తెరకెక్కిస్తూ ఉండడం గమనార్హం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి