టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ మరియు చందు మొండిటి కాంబినేషన్లో వచ్చిన కార్తికేయ సినిమా మంచి విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. దాంతో గత సంవత్సరం ఇదే కాంబినేషన్లో వచ్చిన కార్తికేయ 2 సినిమా ఏకంగా పాన్ ఇండియా రేంజ్ లో విడుదలై ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. గత సంవత్సరం ఆగస్టులో విడుదలైన కార్తికేయ సినిమా మెల్లిగా మొదలై దేశం అంతా విస్తరించి భారీ విజయాన్ని అందుకుంది. అంతేకాదు ఏకంగా 130 కోట్ల గ్రామ కలెక్షన్స్ ని సాధించి షాక్ ఇచ్చింది. దీంతో నిఖిల్ కెరియర్ ఒక రేంజ్ లోకి వెళ్ళిపోయింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

కార్తికేయ టు సినిమా తరువాత నుండి నిఖిల్ అన్ని పాన్ ఇండియా సినిమాలే చేస్తున్నాడు. అయితే కార్తికేయ సిరీస్ ఫ్యాన్స్ ఈ సినిమాకి పార్ట్ 3 ఉంటుందా ఉంటే ఒకవేళ ఎప్పుడూ ఉంటుంది అంటూ ప్రతిసారి ఇదే ప్రశ్న అడుగుతూ వస్తున్నారు. అయితే గతంలో కూడా డైరెక్టర్ మరియు నిఖిల్ కార్తికేయ 3 కూడా ఉంటుంది అని చెప్పకనే చెప్పారు. ఈ నేపథ్యంలోని తాజాగా మరొకసారి కార్తికేయ 3 పై మాట్లాడాడు. ఈ సినిమా డైరెక్టర్ చందు కార్తికేయ టు సినిమా రిలీజ్ అయి సంవత్సరం అయినందుకు గాను చిత్ర బృందం మీడియాతో ఒక స్పెషల్ సమావేశం ని ఏర్పాటు చేయడం జరిగింది.

ఈ నేపథ్యంలోని డైరెక్టర్ చందు మొండిటి మాట్లాడుతూ నిఖిల్ ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు.. నిఖిల్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి.. నా చేతిలో ఒక సినిమా ఉంది.. అతని మూడు సినిమాలు నాదొక సినిమా అయిపోయిన తర్వాత వెంటనే కార్తికేయ త్రి సినిమా ఉండబోతోంది. ఈసారి మరింత భారీగా ఈ సినిమా ఉండబోతుంది.. అంటూ ఈ సందర్భంగా చెప్పాడు చందు..  దీంతో కార్తికేయ 3  సినిమా ఉంటుంది అని స్పష్టమైనా కానీ కార్తికేయత్రి రావడానికి మరింత టైం పడుతుంది అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: