అయితే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ అటు సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ అభిమానులకు తన అప్డేట్స్ ఇస్తూ యాక్టివ్గానే ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. కాగా ఇప్పుడు రష్మిక మందన్నాకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఏకంగా నాగర్జున ఒక విషయంలో రష్మిక మందన్నను రిక్వెస్ట్ చేసిన రష్మిక అందుకు ఒప్పుకోలేదట. 2016లో విడుదలైన సోగ్గాడే చిన్నినాయన సినిమాకు బంగార్రాజు మూవీ సీక్వల్ గా వచ్చి సూపర్ హిట్ సాధించింది. ఈ సినిమాలో నాగచైతన్యకు జోడిగా కృతి శెట్టి నటించింది. అయితే ఈ పాత్ర కోసం ముందుగా రష్మికను అప్రోచ్ అయ్యారట మేకర్స్.
కానీ అప్పటికే వరుస కాల్ షీట్లతో బిజీగా ఉంది రష్మిక. దీంతో బంగార్రాజు సినిమా కోసం టైమ్ కేటాయించలేకపోయింది అని చెప్పాలి. దీంతో ఇక ఈ ఆఫర్ కాస్త కృతి శెట్టి వద్దకు వెళ్ళిందట. అయితే ఇక బంగార్రాజు సినిమాలో నటించాలని స్వయంగా నాగార్జున కాల్ చేసి అడిగినా కూడా రష్మిక నో చెప్పిందట. దీనికి కారణం సినిమాలో నటించాలని ఉన్నప్పటికీ.. తనకు డేట్స్ ఖాళీ లేకపోవడంతో.. సినిమా ఒప్పుకొని డేట్స్ కేటాయించలేక డిసప్పాయింట్ చేయడం కంటే ముందే చెబితే టెన్షన్ ఉండదు అని రష్మిక అనుకుందట. అయితే నాగార్జున అడిగిన రష్మిక ఒప్పుకోలేదన్న వార్త వైరల్ గా మారిపోవడంతో అక్కినేని ఫ్యాన్స్ రష్మికను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి