
అన్యోన్య దంపతులుగా ఇండస్ట్రీలో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న కొంతమంది సినీ సెలబ్రిటీలు ఏకంగా తమ వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విడాకులు తీసుకునేందుకు సిద్ధమవుతున్నాం అంటూ ప్రకటించి అందరినీ అవాక్కయ్యేలా చేస్తూ ఉన్నారు. అయితే టాలీవుడ్ లో ఎలా అయితే సమంత, నాగచైతన్య విడాకుల ప్రకటన తర్వాత అందరూ షాక్ లో మునిగిపోయారో.. కోలీవుడ్లో ఐశ్వర్య, ధనుష్ విడాకుల గురించి తెలుసు కూడా అందరూ ఇలాగే ఆశ్చర్యపోయారు. దాదాపు 17 ఏళ్ల వైవాహిక బంధానికి ఈ జంట స్వస్తి పలుకుతూ ఇటీవల నిర్ణయం తీసుకుంది.
విడాకుల తర్వాత ఎవరి కెరియర్ లో వాళ్ళు బిజీబిజీగా గడుపుతూ ఉన్నారు అని చెప్పాలి. అయితే ఐశ్వర్య ధనుష్ విడాకుల తర్వాత వీరి విడాకులకు ఇదే కారణం అంటూ ఎన్నో వార్తలు తెరమీదకి వచ్చాయ్. ఇక ఇప్పుడు మరో వార్త సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తుంది. సాఫీగా సాగిపోతున్న ఐశ్వర్య, ధనుష్ కాపురంలో హీరో శింబునే చిచ్చుపెట్టాడు అంటూ టాక్ వినిపిస్తుంది. అంతేకాదు ఇక ధనుష్ కూడా ఒక స్టార్ హీరోయిన్ ప్రేమలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఐశ్వర్య అటు శింబుతో ప్రేమాయణం నడపడం కారణంగానే ఇక మ్యాటర్ విడాకుల వరకు వచ్చిందని టాక్ వినిపిస్తుంది. ఇది ఎంతవరకు నిజమో అన్నది తెలియదు. కాగా ఐశ్వర్య, ధనుష్ దాంపత్య బంధానికి గుర్తుగా ఇద్దరు కొడుకులు ఉన్నారు అన్న విషయం తెలిసిందే.