ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప పార్ట్ 2 మూవీ లో హీరోగా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ మూవీ తర్వాత అల్లు అర్జున్ , మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. ఈ మూవీ తర్వాత ప్రస్తుతం ఇండియా వ్యాప్తంగా సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించడానికి కమిట్ అయ్యాడు.

కాకపోతే త్రివిక్రమ్ సినిమా తర్వాత సందీప్ సినిమా మొదలు కావడానికి మధ్యలో కొంత సమయం అల్లు అర్జున్ ఖాళీగా ఉండే అవసరాలు ఏర్పడినట్లు తెలుస్తోంది. దానితో ఆ మధ్యలో ఓ సినిమాని ఫుల్ స్పీడ్ గా పూర్తి చేయాలి అని ఆయన డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ప్రస్తుతం పలువురు తమిళ దర్శకులతో చర్చలు కూడా సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే అందులో భాగంగా తాజాగా చెన్నై వెళ్లి తమిళ దర్శకుడు అట్లీ తో మూవీ గురించి డిస్కషన్ చేసినట్లు ... ఆయన కూడా కథను ఒక చిన్న లైన్ లో చెప్పినట్లు తెలుస్తోంది. ఒక వేళ బన్నీ కి కనుక అట్లీ చెప్పిన కథ కనుక నచ్చినట్లు అయితే విరి కాంబో సినిమా కి సంబందించిన అనౌన్స్మెంట్ మరి కొన్ని రోజుల్లో వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇకపోతే అట్లీ తో చర్చలు అనంతరం అల్లు అర్జున్ తిరిగి హైదరాబాదుకు చేరుకున్నాడు. ఇకపోతే వీరి కాంబినేషన్ లో కనక మూవీ సెట్ అయినట్లు అయితే ఈ సినిమాకు అనిరుద్ సంగీతం అందించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే అట్లు తాజాగా షారుఖ్ ఖాన్ హీరోగా రూపొందిన జవాన్ మూవీ కి దర్శకత్వం వహించి భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: