ప్రభాస్ - రాజమౌళి.. ఈ కాంబినేషన్ క్రియేట్ చేసిన రికార్డులు అన్ని ఇన్ని కావు అన్న విషయం తెలిసిందే. అప్పట్లో వచ్చిన చత్రపతి ఎలా అయితే ఇండస్ట్రీ హిట్గా నిలిచిందో.. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో భారీ అంచనాల మధ్య వచ్చిన బాహుబలి సినిమా కూడా ఏకంగా సరికొత్త రికార్డులను సృష్టించింది. ఇక బాహుబలి 2 క్రియేట్ చేసిన రికార్డులను అయితే ఇప్పటి వరకు ఏ సినిమా కూడా బద్దలు కొట్టలేక పోయింది అని చెప్పాలి  ఇప్పుడు వరకు చాలానే సినిమాలు విడుదలైన కొన్ని సినిమాలు కేవలం ఒకే ఒక ఏరియాలో బాహుబలి 2 రికార్డులు బ్రేక్ చేశాయి. కానీ అన్ని రికార్డులను బద్దలు కొట్టలేకపోయాయి. ఇక ఇప్పుడు ఏకంగా బాహుబలి రికార్డులను బద్దలు కొట్టే సినిమా రాబోతుంది అన్న వార్త ఇండస్ట్రీలో వైరల్ గా మారిపోయింది. విక్రమ్ హీరోగా నటిస్తున్న సూర్యపుత్ర కర్ణ షూటింగ్ త్వరలో మొదలు కాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమాకు సంబంధించిన టీజర్ కూడా ఇటీవల విడుదలైంది. అయితే చాలా సంవత్సరాల క్రితం ఈ సినిమాకు సంబంధించి కొన్ని యుద్ధ సన్నివేశాలను కూడా తెరకెక్కించారు. ఆ సమయంలో వివిధ కారణాల వల్ల సినిమా షూటింగ్ పూర్తిగా ఆగిపోయింది  అయితే ఇప్పుడు మళ్లీ షూటింగ్ మొదలు కావడంతో అభిమానులు సంతోష పెడుతున్నారు. ఆర్ఎస్ విమల్ సినిమాకు దర్శకత్వం వహిస్తూ ఉన్నాడు అని చెప్పాలి.


 ఈ సినిమాకు సరిగ్గా ప్రమోషన్స్ చేసి ప్రేక్షకుల్లోకి తీసుకెళ్తే మాత్రం తప్పకుండా బాహుబలి 2 కలెక్షన్లను ఈ మూవీ బ్రేక్ చేయగలదు అని నెటిజెన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టేందుకు కూడా వెనకడుగు వేయడం లేదట. ఇప్పటికే పోనియన్ సెల్వన్ సీక్వల్ సినిమాలతో మార్కెట్ను పెంచుకున్న విక్రమ్.. ఇక ఇప్పుడు ఈ సినిమాతో కూడా అదే స్థాయి మ్యాజిక్ ను రిపీట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే ఈ సినిమా టీం కి విక్రం కి మధ్య సమస్యలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రచారంలో నిజం ఎంత ఉందో తెలియాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: