ఆర్ఎక్స్ 100 సినిమాతో ప్రేక్షకులను తన అందంతో బోల్డ్ గా నటించి మెస్మరైజ్ చేసిన పాయల్ రాజ్ పుత్ ఈ సినిమాలో భారీ పాపులారిటీ దక్కించుకుంది. దర్శకుడు అజయ్ భూపతి కూడా రెండో సినిమాకే ఆడియన్స్ కి ఊహించని షాక్ ఇచ్చాడు. ఇకపోతే మహా సముద్రం సినిమాతో చెడ్డ పేరును మూటగట్టుకున్న అజయ్ భూపతి ఈ సినిమాతో కాస్త గ్యాప్ తీసుకొని ఇప్పుడు మంగళవారం అనే సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అయ్యాడు. తెలుగు, కన్నడ, మలయాళం, తమిళ్ భాషల్లో వస్తున్న ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇకపోతే ఇప్పటికే హాట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న పాయల్ మంగళవారం పోస్టర్ లో బ్యాక్ లెస్ న్యూడ్ గా కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది . ఇందులో శైలజ అనే పాత్రలో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాతో ప్రేక్షకులకు మరో బోల్డ్ కంటెంట్ ను అందించడానికి సిద్ధమైందని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమాకి విరూపాక్ష కు మ్యూజిక్ అందించిన మ్యూజిక్ డైరెక్టర్ అజ్నీష్ లోకనాథ్ మ్యూజిక్ ని అందించారు. ఇప్పటికే సినిమా నుంచి పోస్టర్లు విడుదల అవ్వగా భారీ రెస్పాన్స్ లభించింది. ఇక టీజర్ లో కూడా మేకింగ్ అండ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సూపర్బ్ అనిపించింది.


టీజర్ విడుదల చేసిన కొద్ది రోజులకే హైప్ ని మరింత పెంచుతూ "గణగణా మోగాలిరా" అంటూ ఒక పాట బయటకు వచ్చి.. ఆ పాట కూడా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు మంగళవారం సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ని డైరెక్టర్ అజయ్ భూపతి రివీల్ చేశాడు.  నవంబర్ 17వ తేదీన మంగళవారం సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేయడం గమనార్హం.  ఇకపోతే ఈ అనౌన్స్మెంట్తో మేకర్స్ వదిలిన ఒక పోస్టర్ చాలా కలర్ ఫుల్ గా అనిపిస్తుంది . ఇందులో పల్లెటూరి అమ్మాయిలా పాయల్ సీతాకోకచిలుకలతో ఆడుకుంటూ కనిపించింది. ఇప్పటికే టీజర్ , పాటలు ప్రేక్షకులను అలరించాయి. మరి సినిమా ఏ విధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: