టాలీవుడ్ హీరో ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా లేవల్లో తమ చిత్రాలను తెరకెక్కిస్తే ఉన్నారు. చివరిగా బాహుబలి సినిమాలతో మంచి విజయాలను అందుకున్న ప్రభాస్ ఆ తర్వాత నటించిన చిత్రాలన్నీ కూడా అభిమానులను నిరాశపరిచాయి. ఇటీవలే ప్రభాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీళ్ కాంబినేషన్లో వస్తున్న సలార్ సినిమా పైన అభిమానులు ఆశ పెట్టుకున్నారు. ఈ సినిమా ఈ నెల 28వ తేదీన విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత వాయిదా పడడం జరిగింది. ఈ సినిమా పోస్ట్ పోన్ అవ్వడంతో ఎన్నో సినిమాలు ఆ తేదీకి విడుదల కావడం జరిగింది.


సలార్ సినిమా విడుదల తేదీ ఎన్నో చిత్రాలకు కలిసొచ్చిన సలార్ సినిమా కొత్త రిలీజ్ డేట్ పైన పలు రకాల వార్తలు వినిపిస్తున్నాయి. సలార్ సినిమా క్రిస్మస్ కానుకగా ఈ ఏడాది డిసెంబర్ 22న విడుదల కాబోతోంది అంటూ ఒక టాక్ వినిపిస్తోంది. అయితే ఈ విషయం పైన నిర్మాతల నుంచి అధికారికంగా ఇంకా ప్రకటన వెలుబడలేదు. ఈ సమయంలోనే ఎన్నో చిత్రాలు సైతం డిసెంబర్ నెలలో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది అందులో.. సైంధవ, హాయ్ నాన్న, హరోం హర, నితిన్ ఎక్స్ట్రార్డినరీ తదితర చిత్రాలు ఉన్నట్లు సమాచారం.


డిసెంబర్ 22న విడుదల కాబోతోందని డిస్ట్రిబ్యూటర్లకు ఇన్ఫర్మేషన్ వచ్చినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా ప్రశాంత్ నీళ్ భార్య లిఖిత రెడ్డి కూడా ఈ డిసెంబర్ ఇంతకుముందులా ఉండదు అంటూ ఇంస్టాగ్రామ్ లో ఒక స్టోరీని షేర్ చేయడం జరిగింది. ఈ సినిమా విడుదల తేదీపై బాలీవుడ్ ప్రేక్షకులు ఒక్కసారిగా షాక్ తింటున్నారు. ఎందుకంటే షారుక్ ఖాన్ నటిస్తున్న డంకి  చిత్రం కూడా డిసెంబర్ 22 నే రాబోతోంది. షారుక్ నటించిన పఠాన్, జవాన్ చిత్రాలు కూడా ఈ ఏడాది విడుదలై భారీ కలెక్షన్స్ సాధించాయి. ఇలాంటి సమయంలో ప్రభాస్ షారుక్ ఖాన్ సినిమాలు ఒకేరోజు రావడం మంచిది కాదని కొంతమంది అభిప్రాయంగా తెలుపుతున్నారు. అలాగే డిసెంబర్ 20న హాలీవుడ్ మూవీ ఆక్వా మ్యాన్ రిలీజ్ కూడా ఉన్నది. ఈ సినిమా మల్టీప్లెక్స్ ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: