
నాని ‘హాయ్ నాన్న’ తమ సినిమా ప్రమోషన్ విషయంలో కొత్త పద్ధతులకు శ్రీకారం చుట్టింది. ఈసినిమాకు సంబంధించి లేటెస్ట్ గా విడుదలైన ఈ మూవీలోని మొదటి పాట ‘గాజుబొమ్మ’ పాటను లేటెస్ట్ గా విడుదల చేశారు. అయితే ఈ పాటకు ముందు ఒక చిన్న ప్రమోషన్ వీడియోను ఘాట్ చేశారు. ఆ వీడియో అందర్నీ ఆకట్టుకునే విధంగా డిజైన్ చేయించారు.
‘ఖుషీ’ మూవీలోని పాటలతో యూత్ కు బాగా కనెక్ట్ అయిన నేపధ్యంలో హేశం అబ్దుల్ వహబ్ ‘హాయ్ నాన్న’ సినిమా పాటలకు ట్యూన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీలోని పాటలను జనం మధ్యకు బాగా తీసుకువెళ్ళడానికి హీరో నాని ప్రత్యేకంగా కొన్ని ప్రోమోలను ఘాట్ చేయిస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ ప్రమోగం విజయవంతం అయితే ఇక రానున్న రోజులలో హీరోలు తమ సినిమాలకు సంబంధించిన పాటల ప్రోమో వీడియోలలో కూడ కనిపించి ప్రమోట్ చేసుకోవలసిన పరిస్థితి.
డిసెంబర్ లో ‘సలార్’ వస్తున్న పరిస్థితులలో ఆసినిమా రిలీజ్ డేట్ కంటే ముందుగా డిసెంబర్ మొదటి వారంలో తమ సినిమాను విడుదల చేయాలా లేదంటే సంక్రాంతి హడావిడి అంతా పూర్తి అయిన తరువాత ప్రశాంతంగా ఫిబ్రవరిలో విడుదల చేయాలా అన్న కన్ఫ్యూజన్ లో మూవీ నిర్మాతలు ఉన్నప్పటికీ చాల ముందుగానే ఈమూవీ పాటల ప్రమోషన్ మొదలుపెట్టడమే కాకుండా డానికి సంబంధించి ఒక కొత్త టెక్నిక్ ను అనుసరిస్తూ ఉండటం ప్రస్తుతం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది..