అందాల ముద్దుగుమ్మ శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అక్కర్లేదు. ఈ బ్యూటీ కెరియర్ ప్రారంభంలో వరుసగా తమిళ ... తెలుగు సినిమాలలో నటించింది. ఇక ఈ ముద్దుగుమ్మ కెరియర్ ప్రారంభంలో నటించిన సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతూ వచ్చాయి. దానితో ఈ బ్యూటీ కి ఒకానొక సమయంలో ఐరన్ లెగ్ అనే పేరు కూడా వచ్చింది. ఇక అలాంటి సమయం లోనే శృతి ... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరిష్ శంకర్ దర్శకత్వంలో బండ్ల గణేష్ నిర్మాణంలో రూపొందిన గబ్బర్ సింగ్ అనే మూవీ లో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో శృతి కి వరసగా సినిమా అవకాశాలు దక్కాయి. అలాగే ఈ నటి నటించిన అనేక సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు సాధించడంతో ఆ తర్వాత కాలంలో ఈ బ్యూటీ కి ఐరన్ లెగ్ అనే పేరు పోయి గోల్డెన్ లెగ్ అను పేరు వచ్చేసింది. 

ఇక ఇప్పటికే ఈ సంవత్సరం ఈ బ్యూటీ వీర సింహా రెడ్డి ... వాల్టేరు వీరయ్య మూవీ లతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయాలను అందుకుంది. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే ఈ బ్యూటీ ప్రభాస్ హీరోగా రూపొందిన సలార్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇలా వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ బ్యూటీ తాజాగా తన సోషల్ మీడియా అకౌంట్ లో ఒక ఫోటోను పోస్ట్ చేసింది. తాజాగా శృతి తన సోషల్ మీడియా అకౌంట్ లో ట్రెడిషనల్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోను పోస్ట్ చేసింది. ఈ ఫోటో లో శృతి చీర కట్టులో సాంప్రదాయ బద్ధమైన లుక్ లో ఉంది. ఇక శృతి హాసన్ కు సంబంధించిన ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: