కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి భాషతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. ఓవైపు హీరోగా నటిస్తూనే మరోవైపు విలన్ గా, పాత్ర నచ్చితే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను నటించేందుకు ఓకే చెబుతున్నారు. తన నటన, హావభావాలతో సౌత్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకున్న విజయ్ సేతుపతి రీసెంట్ టైమ్స్ లో బాలీవుడ్ పై ఎక్కువ దృష్టి పెట్టాడు. అక్కడ సినిమాలు, వెబ్ సిరీస్ లతో బిజీ అయిపోయాడు. రీసెంట్ గా బాలీవుడ్ లో వచ్చిన ఫర్జీ వెబ్ సిరీస్ లో విజయ్ సేతుపతి నటనకి బాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అలాగే షారుక్ జవాన్ మూవీలో తన విలనిజంతో అదరగొట్టాడు. ఇక ఇప్పుడు మేరీ క్రిస్మస్ మూవీ తో హీరోగా బాలీవుడ్ ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. 

విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జోడిగా నటిస్తున్న సినిమా ఇది. శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని టిప్స్ ఫిలిమ్స్ మ్యాచ్ బాక్స్సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్స్ సినిమాపై క్యూరియాసిటీని పెంచగా మొదట క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25న సినిమా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఆ సమయానికి బాలీవుడ్ లో షారుక్ ఖాన్ 'డంకీ' టాలీవుడ్ లో ప్రభాస్ సలార్ సినిమాలు రిలీజ్ కాబోతుండడంతో మేకర్స్ అంతకంటే ముందుగా అంటే డిసెంబర్ 8న సినిమాని విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ పలు అనివార్య కారణాలవల్ల డిసెంబర్ 8న కాకుండా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న మేరీ క్రిస్మస్ మూవీని

 రిలీజ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడిస్తూ కొత్త రిలీజ్ డేట్ ని పోస్టర్ ద్వారా ప్రకటించారు. ఈ పోస్టర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు వచ్చే సంక్రాంతికి థియేటర్స్ లో సందడి చేయబోతోంది. ఈ చిత్రాన్ని హిందీ, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించారు. హిందీ వెర్షన్ లో సంజయ్ కపూర్, రాధిక ఆప్టే, పాటక్ వినయ్, గాయత్రి శంకర్, ప్రతిమ ఖన్నా, టీనూ ఆనంద్ కీలక పాత్రల్లో కనిపించనుండగా తమిళ వెర్షన్ లో రాధిక శరత్ కుమార్, షణ్ముఖ రాజా, కెవిన్ జై బాబు, రాజేష్ విలియమ్స్ కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: