కోలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరో లలో సూర్య ఒకరు. సూర్య కేవలం తమిళ సినిమా ఇండస్ట్రీ లో మాత్రమే కాకుండా తాను నటించిన ఎన్నో సినిమాలను తెలుగు లో విడుదల చేసి అందులో అనేక మూవీ లతో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ లను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో కూడా తనకంటూ ఒక అదిరిపోయే రేంజ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. ఇకపోతే ప్రస్తుతం సూర్య ... శివ దర్శకత్వంలో రూపొందుతున్న కాంగువ అనే భారీ బడ్జెట్ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు.

మూవీ షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ దిశా పటానీ ఈ సినిమాలో సూర్య సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి జనాల నుండి అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఇది ఇలా ఉంటే మొదటి నుండి ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా చాలా భాషలలో విడుదల చేయబోతున్నారు అని వార్తలు వచ్చిన విషయం మనకు తెలిసిందే.

 ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ ని ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 38 భాషల్లో 3D మరియు ఐమాక్స్ వర్షన్ లలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ పై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకోగా తెలుగు సినీ ప్రేమికులు ఈ మూవీ పై పర్వాలేదు అనే స్థాయిలో అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: