రష్మిక రణబీర్ కపూర్  కాంబినేషన్లో ఇటీవల విడుదలైన యానిమల్ సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఈ సినిమా థియేటర్ల లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.అయితే తాజాగా ఈ సినిమా ఈవెంట్ కి సంబంధించిన కొన్ని ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. ఇక ఈ ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్ గా అలియా భట్  రష్మిక విషయంలో చేసిన ఒక పని వైరల్ గా మారింది.ఇక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విడుదలైన యానిమల్ సినిమా ఇప్పటికే ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకొని బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమా ఈవెంట్లో భాగంగా రణబీర్ కపూర్ తన భార్య అలియా భట్ అలాగే నీతూ కపూర్ తో కలిసి పాల్గొన్నారు.ఇక ఈ ఈవెంట్ కి యానిమల్ మూవీ  హీరోయిన్ రష్మిక మందన్నా కూడా వచ్చింది. అయితే రష్మిక మందన్న అలియా భట్ ఇద్దరు ఎదురుపడిన సమయంలో హగ్ చేసుకున్నారు.అయితే అలా హాగ్ చేసుకున్న సమయంలో అలియా భట్ పెట్టిన ఫేస్ ఎక్స్ప్రెషన్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ గా మారింది. దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి. దానికి ప్రధాన కారణం రష్మిక మందన్నాని అలియా భట్ కౌగిలించుకున్న సమయంలో ఆలియా తన ఫేస్ ని కాస్త కోపంగా పెట్టడంతో ప్రస్తుతం ఈమె ఎక్స్ప్రెషన్స్ నెట్టింట వైరల్ గా మారాయి.అయితే అలియా భట్ అలా ఫేస్ పెట్టడంతో నీతూ కపూర్  నవ్విన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.అయితే యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ తో కలిసి రష్మిక మందన్నా చాలా బోల్డ్ సన్నివేశాల్లో చేసింది. అయితే ఇలా చేయడం అలియాభట్ కి నచ్చకే ఇలా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిందా ఏంటి అని కొంతమంది నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: