
ఇదే స్థాయిలో కలెక్షన్స్ అందుకుంటే రాబోయే రోజుల్లో 1000 కోట్ల కలెక్షన్స్ సైతం అందుకుంటుందని పలువురు అభిమానులు తెలియజేస్తున్నారు. ఈ సినిమా జైలర్ లియో సినిమాను కూడా దాటేస్తే స్టేజ్ కి వెళ్ళిపోయిందని పలువురు అభిమానులు సైతం తెలియజేస్తున్నారు. ఇందులో ప్రతి ఒక్కరు నటన కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పవచ్చు. ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. కానీ కొంతమంది మాత్రం ఈ సినిమా కాస్త లెంతిగా ఉందంటూ మరి కొంతమంది ఫాదర్ సెంటిమెంట్ అద్భుతంగా ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా హైలెట్ గా ఉందని తెలుగులో 15 కోట్ల టార్గెట్ ను కేవలం అతి తక్కువ సమయంలోనే ఈ సినిమా కొల్లగొట్టేసిందని తెలుస్తోంది. రణబీర్ కపూర్ కెరియర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచిందని ట్రెండు వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ సినిమా ఓటిటి విషయానికి వస్తే ఓటీటి రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ తీసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి వచ్చే ఏడాది జనవరి 26వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి అధికారికంగా ప్రకటన త్వరలోనే వెలువబోతున్నట్లు సమాచారం మరి టోటల్గా ఎన్ని కోట్లు కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.