మహేష్ బాబు అభిమానులు కలలు కంటున్న రాజమౌళి మహేష్ ల భారీ మూవీ ప్రాజెక్ట్ కు రంగం సిద్దం అవుతోంది. పాన్ ఇండియా స్థాయిలో కాకుండా పాన్ వరల్డ్ స్థాయిలో నిర్మాణం జరుపుకోబోయే ఈమూవీని 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తీయబోతున్నారు. ఒక ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ ఈమూవీ ప్రాజెక్ట్ లో భాగస్వామిగా ఉంటుందని లీకులు వస్తున్నాయి.ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ దశలో ఉన్న ఈసినిమాకు సంబంధించిన టెక్నీషియన్స్ ఎంపిక విషయంలో రాజమౌళి తీసుకున్న ఒక నిర్ణయం మహేష్ అభిమానులను కలవర పెడుతున్నట్లు టాక్. గతంలో రాజమౌళితో పనిచేసిన కొందరు ప్రముఖ టెక్నీషియన్స్ ఈమూవీ ప్రాజెక్ట్ లో లేకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటో అర్థంఅవ్వక మహేష్ అభిమానులు విపరీతంగా కలవర పడుతున్నట్లు తెలుస్తోంది.రాజమౌళి గతంలో తీసిన అనేక భారీ ప్రాజెక్ట్ లకు కెమెరా మెన్ గా వ్యవహరించిన సెంధిల్ కుమార్ ఈ ప్రాజెక్ట్ నుండి ఎందుకు తప్పుకున్నాడో మహేష్ అభిమానులకు అర్థం కావడంలేదు ‘మగధీర’ ‘ఈగ’ ‘బాహుబలి’ ‘ఆర్ ఆర్ ఆర్’ సినిమాల్లో సెంథిల్ కెమెరా పనితనం ఆసినిమాల ఘన విజయానికి ఎంతగానో సహకరించిన విషయం తెలిసిందే. రాజమౌళి విజన్‌ కు తగ్గట్లుగా విజువల్స్ అందించడంలో సెంధిల్ సిద్ధహస్థుడు.సెంథిల్ స్థానంలో వచ్చిన పి.ఎస్.వినోద్ కూడా మంచి సినిమాటోగ్రాఫరే అయినప్పటికీ సెంథిల్ స్థాయిలో ఔట్ పుట్ ఇవ్వగలడా అన్న సందేహాలు మహేష్ అభిమానులకు కలుగుతున్నాయి. ఇక విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్‌ గా శ్రీనివాస్ మోహన్ స్థానంలోకి కమల్ కణ్ణన్ వచ్చాడు అన్న వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా ఇండియాలో నంబర్ వన్ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ స్థానంలోకి మోహన్ అనే టెక్నీషియన్ రాజమౌళి కొత్తగా ఎంచుకున్నాడు అన్న వార్తలు వస్తున్నాయి. దీనితో మహేష్ తో తీయబోతున్న భారీ మూవీ ప్రాజెక్ట్ లో జక్కన్న ఎందుకు ఇన్ని మార్పులు చేస్తున్నాడు అంటూ మహేష్ అభిమానులు గందరగోళంలో ఉన్నట్లు తెలుస్తోంది..    
మరింత సమాచారం తెలుసుకోండి: