టాలీవుడ్ లో ఈ మధ్య రీ రిలీజ్ సినిమాల ట్రెండ్ చాలా ఎక్కువైపోయిందనే చెప్పాలి.ఇప్పుడు రిలీజ్ అయ్యే కొత్త సినిమాల కంటే పాత సినిమాలకే ఎక్కువ ఎగబడుతున్నారు జనాలు. విశేషమేమిటంటే ఆ రోజుల్లో ప్లాప్ అయి అండర్రేటెడ్ క్లాసిక్ మూవీస్ గా నిలిచిన సినిమాలని కూడా జనాలు రీ రిలీజ్ చేయించుకుని మరి చూస్తూ తెగ సందడి చేస్తున్నారు.గత ఏడాది విడుదలయిన ఆరెంజ్, ఈ నగరానికి ఏమైంది, రీసెంట్ గా వెంకీ సినిమాల్ని ఆడియన్స్ ట్రెండ్ చేసి మరీ రీ రిలీజ్ లో పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ చేసారు. అయితే అవి బాగా ఆడుతున్నాయి కదా, అని అన్ని సినిమాలు గ్యాప్ లేకుండా ఎప్పుడు పడితే అప్పుడూ భారీ లెవెల్ లో రిలీజ్ చేసుకుంటూ పొతే ఫలితం కూడా దారుణంగా ఉంటుంది. పైగా ఆడియన్స్ నుంచి డిమాండ్ కూడా లేకుండా రాంగ్ టైమింగ్ లో రిలీజ్ చేస్తే ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమాలు అయినా జనాలు పట్టించుకోరని ప్రస్తుత పరిస్థితులు తెలియచేస్తున్నాయి.


ఇక తాజాగా రిలీజ్ అయిన సమరసింహారెడ్డి మూవీ కలక్షన్లే దీనికి ఉదాహరణ.నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సమరసింహారెడ్డి రీసెంట్ గా పాతికేళ్ళు పూర్తయిన సందర్బంగా మార్చి 1న రీ రిలీజ్ చేసారు. అది కూడా  ట్రైలర్ స్పెషల్ గా లాంచ్ చేసి, తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా మొత్తం 500 థియేటర్లలో రిలీజ్ చేసారు.ఇక రీ రిలీజ్ ల ట్రెండ్ లో భాగంగా  ఆడియన్స్ ముందుకు సమర సింహా రెడ్డి సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేశారు. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే నాలుగు వందలకి పైగా థియేటర్లలో రీ రిలీజ్ చేశారు.కానీ ఎక్కడా మినిమం ఇంపాక్ట్ కూడా చూపలేకపోయింది. ఇక హైదరాబాద్ లో అయితే మరీ దారుణం. పాపం భారీ హోప్స్ తో బయ్యర్లు రీ రిలీజ్ చేసిన ఈ సినిమాను థియేటర్ల దగ్గర ఫ్యాన్స్ తప్ప కామన్ ఆడియన్స్ పట్టించుకోలేదు.ఈ సినిమా దారుణాతి దారుణంగా కేవలం 15 లక్షలు మాత్రమే వసూలు చేసింది.1999 లో ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన ఈ సినిమా ఇప్పుడు రీ రిలీజ్ లో అతి పెద్ద డిజాస్టర్ గా మిగలడం నిజంగా పెద్ద షాక్ కి గురి చేసే విషయం.

మరింత సమాచారం తెలుసుకోండి: