నాచురల్ స్టార్ నాని ఈ మధ్య కాలంలో వరుస విజయాలను అందుకుంటున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందులో భాగంగా పోయిన సంవత్సరం సమ్మర్ కానుకగా నాని నటించిన దసరా సినిమా విడుదల అయింది. ఈ మూవీ తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి అద్భుతమైన విజయం అందుకుంది. ఈ సినిమాతో నాని కి ఇండియా వ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈ నటుడు హాయ్ నాన్న అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ.ని కూడా పాన్ ఇండియా మూవీ గా తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయగా , ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఈ సినిమాతో నాని క్రేజ్ ఇండియా వ్యాప్తంగా మరింతగా పెరిగింది. 

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం నాని "సరిపోదా శనివారం" అనే పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహిస్తూ ఉండగా ,  జాబ్స్ బీజయ్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 29 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు తాజాగా ఈ సినిమాలోని మొదటి పాట విడుదలకు సంబంధించిన అధికారిక ప్రకటనను ప్రకటించారు. ఈ సినిమా లోని మొదటి సాంగ్ అయినటువంటి "గరం గరం" అంటూ సాగే పాటను జూన్ 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. మరి ఈ మూవీ లోని మొదటి సాంగ్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: