సమంత ఈ చిన్నదాని పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. అమాయకమైన నటన, క్యూట్ ఎక్స్ప్రెషన్స్, చలాకితనంతో ప్రేక్షకుల మనసులను కట్టిపడేసింది. ఈ చిన్నది ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఫ్యాన్స్ ను సంపాదించుకుంది. సమంతకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ చిన్నదాని నటన, అందచందాలకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. సమంత సినిమా వస్తుందంటే చాలు ఎగబడి చూసేవారు ఎందరో ఉంటారు. ఇక సమంత ప్రస్తుతం తెలుగులోనే కాకుండా హిందీలోనూ నటించడం ప్రారంభించింది.

 
తెలుగులో దాదాపు స్టార్ హీరోల సినిమాలలో నటించి సక్సెస్ఫుల్ హీరోయిన్ గా మంచి ఫామ్ కొనసాగిస్తోంది. ఇక సమంత బాలీవుడ్ లోనూ హనీ బన్నీ వెబ్ సిరీస్ లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు అందుకుంది. ఈ సిరీస్ ద్వారా సమంత క్రేజ్ విపరీతంగా పెరిగిపోయింది. ప్రస్తుతం సమంత తెలుగు, హిందీలో ఫుల్ బిజీ ఆర్టిస్ట్ గా మారిపోయింది. అంతేకాకుండా సమంత అత్యధిక రెమ్యూనరేషన్ వసూలు చేసే హీరోయిన్లలో ఒకరిగా నిలిచారు. కాగా, సమంతకు సోషల్ మీడియాలోనూ ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. 

ఇక సమంత రీసెంట్ గానే నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టారు. నిర్మాతగా మారి శుభం సినిమాను నిర్మించారు. ఇదిలా ఉండగా.... సమంత తిరుమలకు వెళ్లారు. అక్కడ దేవుడిని దర్శనం చేసుకుని తన మొక్కులను సమర్పించుకున్నారు. అనంతరం శ్రీకాళహస్తి గుడికి వెళ్లారు. అక్కడ రాహు కేతు పూజలను సమంత చేయించుకున్నారు. అయితే చాలావరకు రాహుకేతు పూజలను ఏమైనా దోషపరిహారాలు ఉన్నవారు లేదా వివాహం కోసం, సంతానం కోసం మాత్రమే జరిపించుకుంటారు. మరి సమంత ఈ పూజను చేయించుకుందని తెలిసి చాలామంది సమంత రెండో వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుందని, ఆ కారణంగానే శ్రీకాళహస్తికి వెళ్లి పూజలో పాల్గొన్నట్లుగా అనేక రకాల వార్తలను వైరల్ చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో తెలియాలంటే సమంత ఏదో ఒక క్లారిటీ ఇస్తే కానీ అసలు విషయం బయటకు రాదు.

మరింత సమాచారం తెలుసుకోండి: