తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో నటి సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ చిన్నది ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. సమంత ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు అందుకుంది. ఏ మాయ చేసావే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన సమంత మొదటి సినిమాతోనే సక్సెస్ఫుల్ హీరోయిన్ గా తన కెరీర్ ను కొనసాగించింది. ఇక సమంత ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా చక్రం తిప్పుతోంది.


సమంత హీరోయిన్ గా మాత్రమే కాకుండా నిర్మాణ రంగంలోకి కూడా అడుగుపెట్టారు. సమంత నిర్మాతగా మారి 'శుభం' సినిమాను తీశారు. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవాలని సమంత అభిమానులు కోరుకుంటున్నారు. సమంత మరిన్ని సినిమాలకు నిర్మాణం వహించాలని తన అభిమానులు భగవంతుడిని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే సమంత తనకు సంబంధించి కొన్ని విషయాలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. తెలుగు సినిమా ప్రేక్షకులు కంటెంట్ ఉన్న సినిమాలకు పెద్దపీట వేస్తారు అంటూ సమంత అన్నారు.

తాను నిర్మాతగా వ్యవహరించిన 'శుభం' సినిమాలో అంతా కొత్త వారే నటించినట్టుగా సమంత వెల్లడించారు. నటిగా తన కెరీర్ ప్రారంభించిన సమయంలో తనకు యాక్టింగ్ గురించి పెద్దగా తెలియదని చెప్పింది. తాను నటించిన మొదటి రెండు సినిమాలలో తన యాక్టింగ్ చూస్తే ఇప్పటికీ సిగ్గుగా అనిపిస్తుందని సమంత అన్నారు. ఆ రెండు సినిమాలలో తన యాక్టింగ్ చూస్తే నా పరువు పోయినట్టుగా భావిస్తానని సమంత అన్నారు. ఇక మొదటి రెండు సినిమాల అనంతరం తన నటన చాలా బాగుందని తన నటనను పూర్తిగా మార్చుకున్నానని సమంత వెల్లడించారు. ప్రస్తుతం సమంత బాలీవుడ్ లోనూ సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయింది. ఇప్పటికే సమంత నటించిన సిటాడేల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ మంచి ఆదరణను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: