శృతిహాసన్ ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కమల్ హాసన్ వారసత్వాన్ని అందిపుచ్చుకొని సినిమాల్లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. తనదైన నటన, అందచందాలతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది. ఈ చిన్నది తెలుగులో అనగనగా ఓ ధీరుడు సినిమాతో 2011లో చిత్రపరిశ్రమకు ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు అందుకున్న ఈ చిన్నది వరుసగా సినిమాలు చేసుకుంటూ మంచి గుర్తింపు పొందింది. తన కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించి తన నటనకు గాను ఎన్నో అవార్డులను సైతం పొందింది. ఇక శృతిహాసన్ తెలుగులోనే కాకుండా అనేక భాష చిత్రాలలో నటించడం విశేషం. 

ఈ అమ్మడు తెలుగు, హిందీ, తమిళ్ లో అనేక సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక శృతిహాసన్ బ్యాక్ టు బ్యాక్ సినిమా షూటింగ్ లలో బిజీగా ఉంటుంది. తన చేతినిండా ఎప్పుడూ మూడు నాలుగు సినిమా ప్రాజెక్టులు ఉంటాయి. ఈ క్రమంలోనే శృతిహాసన్ నిన్న చెన్నై వేదికగా జరిగిన మ్యాచ్ కు వచ్చారు. ఎస్సారెస్ వర్సెస్ సీఎస్కే మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ కు శృతిహాసన్ వచ్చి సందడి చేశారు. ఈ మ్యాచ్ లో  సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమిపాలైంది. ఈ ఓటమిని చూసి శృతిహాసన్ కన్నీరు పెట్టుకున్నారు.

దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ గా మారాయి. కాగా, ఈ చిన్నది నిన్న స్టేడియంలో కనిపించడంతో ప్రతి ఒక్కరి దృష్టి తనపైనే పడింది. ఈ క్రమంలోనే శృతిహాసన్ మెడలో తాళిబొట్టు ఉందని కొంతమంది ఫోటోలు షేర్ చేసుకున్నారు. తన మెడలో పసుపు తాడు కనిపించిందని తాను వివాహం చేసుకుందేమోనని కొంతమంది అభిమానులు అంటున్నారు. తీరా చూసినట్లయితే అది పసుపుతాడు కాదని తన మెడలో ఉంది కేవలం విజిల్ మాత్రమేనని తెలిసింది. దీంతో శృతిహాసన్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: