
యూట్యూబ్‌లో ఏకంగా 40 లక్షలకు పైగా వ్యూస్‌తో దూసుకుపోతున్న ఈ సాంగ్.. మిగతా మ్యూజికల్ ఫ్లాట్ ఫామ్స్ లోను మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంటుంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ లెవెల్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కు స్పెషల్ గా విజయ్ దేవరకొండ పాల్గొని సందడి చేశాడు. ఈవెంట్లో సూర్య మాట్లాడుతూ కార్తీక్ సుబ్బరాజు సినిమాను ఎంతో డిఫరెంట్ గా రూపొందించారని.. ట్రైలర్ అందరికీ నచ్చింది కదా సినిమా కూడా అదే రేంజ్ లో ఉంటుందంట చెప్పుకొచ్చాడు.
ఈ సినిమాకు పూజ ప్రమోషన్స్ మర్చిపోలేము అని.. మా కనిమ్మ సాంగ్ అంత సక్సెస్ ఆమె కారణం అంటూ వివరించాడు. కచ్చితంగా ఈ సినిమా అదే రేంజ్ లో బ్లాక్ బస్టర్ అవుతుందని సూర్య చెప్పుకొచ్చాడు. సక్సెస్, ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా ఫాన్స్ నా పై నమ్మకంతో నా వెనక నిలబడుతున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని వివరించాడు. విజయ్ మా అగారం ఫౌండేషన్ గురించి మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉన్న అని.. ఈ ఫౌండేషన్ను ఏర్పాటు చేయాలని ఆలోచన నాకు మెగాస్టార్ చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ను చూసిన తర్వాతే మొదలైంది.
ఈ ఫౌండేషన్ నడపడానికి సత్తువ ఇచ్చింది కూడా మీరే. ఇప్పటివరకు ఈ ఫౌండేషన్ ద్వారా 8000 మంది చదువుతున్నారు. ఎన్ఆర్ఐ అభిమానులు సైతం ఈ సంస్థ పెరగడానికి విరాళాలు అందిస్తూ వస్తున్నారు. అందులో 30% మంది తెలుగు వాళ్ళు పంపిన విరాళాలే ఉన్నాయంటూ చెప్పుకొచ్చాడు. వేలమంది తమిళ విద్యార్థులు చదువుకోవడానికి తెలుగు వాళ్ళ సహాయం అందుతుందని సూర్య ప్రశంసలు వర్షం కురిపించాడు. అదేవిధంగా నెక్స్ట్ సినిమా సీతారా ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో వెంకి అట్లూరి డైరెక్షన్ లో నటించిన అఫీషియల్ గా ప్రకటించాడు. ప్రస్తుతం అగారం ఫౌండేషన్ ఆలోచనకు చిరంజీవిని కారణం అంటూ సూర్యా చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.