మరాఠీ చిత్రాలలో నటించి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన మృణాల్ ఠాకూర్ తెలుగు ప్రేక్షకులకు కూడాసుపరిచితమే.. సీతారామం చిత్రం ద్వారా భారీ క్రేజ్ అందుకున్నది. అయితే గతంలో ఈమె హిందీలో సూపర్ 30, జెర్సీ వంటి చిత్రాలలో కూడా నటించి తనకంటూ ఒక గుర్తింపు సంపాదించుకున్నది. ఆ తర్వాతే తెలుగులో సీతారామం, హాయ్ నాన్న, ఫ్యామిలీ స్టార్స్ వంటి చిత్రాలలో నటించింది. అయితే ఆ తర్వాత కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ ఒక్కొక్క సినిమా చేస్తున్న తరుణంలో ప్రస్తుతం డేకాయిట్ అనే సినిమాలో కూడా నటిస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మృణాల్ ఒక విషయాన్ని బయట పెట్టింది.


డైరెక్టర్ హనురాఘవపూడి  తెరకెక్కించిన సీతారామం చిత్రంలో నూర్జహం పాత్రలో నటించింది. తెలుగులో స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించిన మృణాల్ పేరు టాలీవుడ్ లో ఒక్కసారిగా వైరల్ గా మారింది. అయితే ఇటీవలే ఒక అవార్డు ఫంక్షన్ వచ్చిన సందర్భంగా ఈమెకు ఒక ఊహించని అవమానం జరిగినట్లు తెలియజేసింది. కొద్దిరోజుల క్రితం క్రిటిక్స్ బెస్ట్ యాక్టర్ అవార్డు కార్యక్రమానికి హాజరయ్యేందుకు మృణాల్, జాన్వీ కపూర్ హాజరయ్యారట. అయితే ఈ వేడుకకు ముందుగా మృణాల్ రావడంతో అక్కడున్న మీడియా మొత్తం ఈమె చుట్టూ చేరి పలు రకాల ప్రశ్నలు కూడా వేశారట.

ఇంతలో అక్కడికి జాన్వీ కపూర్ రావడంతో మీడియా ప్రతినిధులు మొత్తం కూడా ఈ ముద్దుగుమ్మను వదిలేసి అక్కడికి వెళ్ళిపోయారు. అయితే ఈ ఊహించని సంఘటనలతో చాలా బాధపడ్డాను అంటూ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించింది. ఈ అవమానకరమైన ఘటనతో కూడా చాలా బాగోద్వేగానికి లోనయ్యానంటూ తెలియజేసింది ఇండస్ట్రీలో స్టార్ కిడ్స్ వారసత్వానికి ఉన్న ప్రాధాన్య సాధారణ నటీనటులకు ఉండదంటూ వ్యాఖ్యలు చేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నాయి. బాలీవుడ్ లో ఎక్కువగా నెపోటిజం ఉందని చాలామంది తెలియజేశారు. ఇప్పుడు మృణాల్ మాటలతో అది ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చంటూ పలువురు నెటిజెన్స్ మాట్లాడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: