తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత పేరు సంపాదించిన నిర్మాణ సంస్థలలో గీత ఆర్ట్స్ బ్యానర్ కూడా ఒకటి.. ఈ బ్యానర్ ద్వారా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు ప్రేక్షకులను బాగా అలరించాయి. ముఖ్యంగా అల్లు అరవింద్ ప్రొడ్యూసర్ గా ఈ బ్యానర్ కి వ్యవహరిస్తూ ఉన్నారు.. అయితే గత కొన్నేళ్లుగా స్టార్ హీరోలతోనే కాకుండా యంగ్ హీరోలతో కూడా కొత్త తరహా చిత్రాలను తెరకెక్కించడానికి ప్రయత్నిస్తున్నారు గీత ఆర్ట్స్ బ్యానర్.. అందుకోసం GA 2 పేరుతో కూడా మరొక విభాగాన్ని మొదలుపెట్టి ఇక్కడ యంగ్ నటీనటులతో వరుసగా సినిమాలను చేస్తూ ఉన్నారు. ఇటీవలే సింగిల్ అనే సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ వచ్చిన అల్లు అరవింద్ పలు విషయాలను తెలియజేశారు.


శ్రీ విష్ణు హీరోగా నటిస్తున్న ఈ చిత్రం మే తొమ్మిదవ తేదీన రిలీజ్ కాబోతోంది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ కు సంబంధించి వచ్చే ఐదేళ్ల ప్రణాళికను ఇప్పటికే సిద్ధం చేశామని తెలిపారు. ఎలాంటి గందరగోళం లేకుండా క్లియర్ గా సమస్త ముందుకు వెళుతోందని ఈవెంట్ సందర్భంగా ఇటీవలే వినిపించినటువంటి ఒక రూమర్ కు ముగింపు పలికారు. బన్నీ వాసు గీత కాంపౌండ్ నుంచి బయటికి వెళ్ళబోతున్నారని వార్తలకు అల్లు అరవింద్ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం


బన్నీ వాసు, తన కోడలు విద్య కొప్పినీడి ఇద్దరు కూడా గీత ఆర్ట్స్ కు రెండు కళ్ళు వీరిద్దరూ విడివిడిగా ఉంటే మాత్రం అసలు ఊహించుకోలేము అంటూ ఎవరూ కూడా ఫేక్ రూమర్స్ సృష్టించకండి అంటూ తెలిపారు. ఇప్పటికే గీత ఆర్ట్స్ వద్ద బోయపాటి శ్రీను లాంటి డైరెక్టర్ల అడ్వాన్సులు కూడా ఇచ్చామని రాబోయే రోజుల్లో బడ ప్రాజెక్టులను కూడా చేస్తాము మీడియం రేంజ్ సినిమాలను కూడా చేస్తామంటూ తెలియజేశారు. మొత్తానికి గీత ఆర్ట్స్ ఐదేళ్ల ఫ్యూచర్ అంతా కూడా ముందుగానే ప్లాన్ చేసి పెట్టారు అల్లు అరవింద్ .మరి మేరకు అల్లు అరవింద్ ప్లాంట్ సక్సెస్ అవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: