ప్రభాస్ ఓ స్టార్ హీరో ..ఓ పాన్ ఇండియా హీరో ..ఓ మంచి మనిషి.. ఓ మంచి మనసున్న వ్యక్తి ఇలా ఎన్నెన్నో మాట్లాడుకుంటూ ఉంటారు.  కానీ ప్రభాస్ గురించి నెగటివ్గా మాట్లాడుకోవాల్సి వస్తే ముందుగా అందరు మాట్లాడుకునేది ప్రభాస్ చాలా బద్ధకస్థుడు . సినిమాల పరంగా ముందుకు ప్రతి విషయంలో ఫాస్ట్ గా వెళ్తాడేమో కానీ పర్సనల్ పరంగా ప్రభాస్ అంత యాక్టివ్ కాదు . ప్రతి విషయాన్ని ఆలస్యం చేస్తాడు. ఇదే విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు జనాలు . కొంతమంది డైరెక్టర్స్ ఇదే విషయాన్ని ఓపెన్ గానే బయటపెట్టారు .


అయితే ప్రభాస్ లో ఉన్న అదే బ్యాడ్ క్వాలిటీ శ్రీలీలలో కూడా ఉంది అంటూ ఫ్యాన్స్ కనిపెట్టేశారు. ప్రభాస్ ఏ విధంగా అయితే బద్దకంగా బిహేవ్ చేస్తాడో శ్రీలీల  కూడా తన పర్సనల్ వర్క్స్ అంటే బద్దకంగా బిహేవ్ చేస్తుందట.  సినిమా షూట్ ఉంటే టకటకా లేచి రెడీ అయిపోయే శ్రీలీల .. అదే సినిమా షూటింగ్ లేదు హాలిడే అంటే మాత్రం చాలా బద్ధకంగా బిహేవ్ చేస్తుందట.  అసలు 11 వరకు నిద్ర లేవదట . ఇంట్లో వాళ్ళ అమ్మగారు లేవమని  చెప్పితే కూడా అస్సలు మాట వినదట .



శ్రీలీల తన విషయంలో తాను బద్ధకస్తురాలు అంటూ జనాలు కూడా మాట్లాడుకుంటూ వచ్చారు. దీంతో ప్రభాస్ లో ఉన్న బ్యాడ్ క్వాలిటీ శ్రీలీల లో కూడా ఉంది అంటూ జనాలు ఫన్నీగా ట్రెండ్ చేస్తున్నారు . వీరిద్దరి కాంబోలో సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ . కానీ ప్రభాసే స్వయంగా శ్రీ లీల తన సినిమాలో వద్దు అంటూ డైరెక్టర్ కి చెప్పారు అన్న వార్త వైరల్ అయ్యింది. కాగా రెబల్ హీరో ప్రభాస్ ఇప్పుడు పలు పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ముందుకు వెళ్ళిపోతున్నాడు. దాదాపు మరొక ఐదు ఏళ్లపాటు కాల్ షీట్స్ కాళీ లేవు ప్రభాస్ షెడ్యూల్లో అంటూ కూడా ఓ న్యూస్ బయటకు వచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: