ఈ మధ్యకాలంలో వెంకటేష్ పేరు సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతూ వచ్చింది.  ఇంకా పక్కగా చెప్పాలంటే మారుమ్రోగిపోయిందనే చెప్పాలి . కాగా సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకోవడమే కాకుండా ఆ సినిమా ద్వారా మంచి మంచి ఆఫర్స్ తన వరకు వచ్చేలా చేసుకుంటున్నాడు వెంకటేష్ . అయితే వెంకటేష్ బడాబడా సినిమాల్లలో నటించడం కన్నా కూడా తనకి లైఫ్ ఇచ్చిన డైరెక్టర్స్ కి మళ్ళీ ఛాన్స్ ఇచ్చే విధంగా ఆలోచిస్తున్నాడు . ఈ క్రమంలోనే ఓ ఫ్లాప్ డైరెక్టర్ కి ఆయన అవకాశం ఇచ్చాడు .


అయితే ఇప్పుడు ఒక సెన్సేషనల్ కాంబోని మళ్లీ రిపీట్ చేయబోతున్నాడు.  త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో వెంకటేష్ ఒక సినిమాకి కమిట్ అయ్యాడు అంటూ ఫిలిం ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.  ఈ కాంబో ఆల్మోస్ట్ ఆల్ సెట్ అయినట్లే అంటూ తెలుస్తుంది . అంతేకాదు ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా ను చూస్ చేసుకున్నారట త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు . ఈ సినిమా కూడా ఫుల్ టు ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ గా తెరకెక్కబోతుందట . ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాలలో వెంకటేష్  కనిపిస్తే ఖచ్చితంగా అది బిగ్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది .



దానికి ఎన్నో బిగ్గ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి . కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా నటిస్తున్నాడు అన్న వార్త ఫుల్ ట్రెండ్ అవుతుంది . రేపో మాపో ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుందట . ఇన్నాళ్లు ఇది జస్ట్ ఫేక్ న్యూస్ అంటూ కొట్టి పడేశారు జనాలు . అయితే ఇప్పుడు ఫిలిం వర్గాలనుంచి స్ట్రాంగ్ గా ఈ న్యూస్ బయటకు రావడంతో వెంకటేష్ - త్రివిక్రమ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయిపోతున్నారు . ఈ మధ్యకాలంలో ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు చాలా అరుదుగా చూస్తున్నాం.  ఇలాంటి మూమెంట్లోనే త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు అలాంటి ఒక కాంబోని సెట్ చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం రియల్లీ గ్రేట్ అంటున్నారు ఫ్యాన్స్..!

మరింత సమాచారం తెలుసుకోండి: