- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ )

హిట్ సీరిస్ సినిమా ల‌పై తెలుగు ఆడియెన్స్ లో ఓ విధ‌మైన క్రేజ్ అయితే వ‌చ్చేసింది. దీనికి తోడు ఈ సీరిస్ లో ఇంత‌కు ముందు వ‌చ్చిన రెండు సినిమాలు హిట్ అయ్యాయి. ఇక ఇప్పుడు నానియే స్వ‌యంగా హిట్ 3 లో న‌టించ‌డంతో అంచ‌నాలు మామూలుగా లేవు. ఇక పాన్ ఇండియా రేంజ్ లో ఈ సినిమాను తీయ‌డం ఒక ఎత్తు అయితే .. నాని స్వ‌యంగా నార్త్ ప్ర‌మోష‌న్ల కోస‌మే ఏకంగా 20 రోజులు టైం కేటాయించారు. ఇక ప్ర‌తిసారి హిట్ సీరిస్ లో త‌ర్వాత వ‌చ్చే సినిమా లో హీరో ఎవ‌రు ? అన్న ఆస‌క్తి ఉంటుంది. హిట్ సిరీస్ లో భాగంగా తర్వాత హీరో ఎవరో అఫీషియల్ గా రివిల్ అయింది. హిట్ 2 క్లైమాక్స్ తర్వాత సీన్లో హీరోగా అర్జున్ సర్కార్ పాత్రలో నేచురల్ స్టార్ నానిని పరిచయం చేశారు. ఇక ఇప్పుడు హిట్ 4 హీరో ఎవ‌రో అన్న‌ది సినిమా క్లైమాక్స్ లో చూపించారు. అమెరికాలో ప్రీమియర్ షోలు పడటంతో ఆ హీరో ఎవరు ? అనేదానితో పాటు అతని పేరు కూడా రివిల్ అయింది.


ఏసీపీ వీరప్పన్ పాత్రలో కార్తీక్ ఎంట్రీ ఇచ్చాడు. హిట్ 4 హీరో కార్తీ అని కొద్ది రోజుల క్రితం లీక్స్ వచ్చాయి. ఆయన పాత్రకు సంబంధించిన సన్నివేశాలను హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్ట‌రీ లో షూట్ చేయడంతో ఈ విషయం బయటకు వచ్చింది. అప్పట్లో ఆ లీక్స్‌ పట్ల దర్శకుడు శైలేష్ కొలను సోషల్ మీడియాలో అసంతృప్తి వ్యక్తం చేశారు. అది పక్కన పెడితే అమెరికాలో ప్రీమియర్ షోల తర్వాత హిట్ ఫోర్ సినిమాలో అఫీషియల్ గా కార్తీ అన్నది రివిల్ అయింది. 3 సినిమా క్లైమాక్స్లో కార్తీక్ ఎంట్రీ ఇచ్చారు. ఏసిపి వీరప్పన్ పాత్రలో ఆయన చార్జి తీసుకున్నారు. కొద్ది రోజుల్లో సిల్వర్ స్క్రీన్ మీద రిపోర్ట్ చేయనున్నారు. మరో ఇంటరెస్టింగ్ టాపిక్ ఏమిటంటే హిట్ ఫోర్ లో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్‌గా కార్తి సందడి చేయనున్నారు. మరి చెన్నై సూపర్ కింగ్స్ అభిమాని అయిన వీరప్పన్ ఏం చేస్తాడో హిట్ 4 సినిమాలో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: