ప్రస్తుతం థియేటర్లలో రిలీజ్ అయ్యే సినిమాల కన్నా ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమాలే ఎక్కువ ఉన్నాయి. ఈ క్రమంలో ప్రతి వారం థియేటర్లలో, ఓటీటీలో ఏ కంటెంట్ రిలీజ్ అవుతుంది అనే విషయం మీద ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ప్రతివారం మంచి పాపులర్ సినిమాలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లో విడుదల అయ్యి.. హిట్ టాక్ ని అందుకుంటాయి. అటు తెలుగు, ఇటు హిందీతో పాటుగా కన్నడ, తమిళం, మలయాళం సినిమాలు కూడా అందుబాటులోకి వస్తాయి. అయితే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో కొన్ని కొత్త సినిమాలు రిలీజ్ అయ్యాయి.

ఈ వేసవి సెలవులలో ప్రేక్షకులను అలరించేందుకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లు సిద్ధం అయ్యాయి. ఇటీవల ఒక సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. మరి ఆ సినిమా ఏంటో.. ఏ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుందో చూద్దాం. ఇటీవలే రిలీజ్ అయిన వెండిపట్టీలు సినిమా మంచి స్పందన పొందింది. ఈ సినిమాలో హీరోగా నటుడు బాలాదిత్య నటించాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా లతా రెడ్డి నటించింది. ఈ మూవీలో చిన్నారి పాత్రలో బేబీ జైత్ర నటించింది. ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ మూవీలో తండ్రి, కూతురికి వెండి పట్టీలు కొనివ్వడానికి పడే కష్టం కనిపిస్తుంది. ఈ సినిమాని కుటుంబ సభ్యులతో చూస్తే బాగుంటుంది.

ఇకపోతే ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ఫ్లిక్స్ లో మ్యాడ్ స్క్వేర్ సినిమా, జువెల్ థీఫ్- ది హీస్ట్ బిగిన్స్, హావోక్. వీక్ హీరో క్లాస్ 2 సినిమా స్ట్రీమింగ్ అవుతున్నాయి. అమెజాన్ ఓటీటీలో నిరమ్ మారుమ్ ఉలిగిల్, జీ5 లో అయ్యన మనే సినిమా రిలీజ్ అయ్యాయి. ఆహాలో యత్తి సాయి సినిమా, మనోరమ మ్యాక్స్ ఓటీటీలో కుమ్మట్టికలి, కల్లం సినిమాలు.. యాపిల్ ప్లస్ టీవి ఓటీటీలో వోండ్లా సినిమా విడుదల అయ్యాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: