సూపర్ స్టార్ మహేష్ బాబుకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మహేష్ బాబు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో తెరకెక్కిన అతడు మూవీ అప్పట్లో సంచలనాలు సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా స్టార్ మా ఛానల్ లో 1500 కంటే ఎక్కువసార్లు ప్రసారమై హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా త్వరలో థియేటర్లలో రీరిలీజ్ కానుందని సమాచారం అందుతోంది.
 
సాధారణంగా ఏ సినిమా రీరిలీజ్ అయినా ఆ సినిమా రైట్స్ మరీ కోట్ల రూపాయలు పలకవు. అయితే అతడు మూవీ రీరిలీజ్ రైట్స్ మాత్రం ఏకంగాన్ 3.09 కోట్ల రుపాయలు పలికాయని తెలుస్తోంది. ఒక విధంగా ఈ మొత్తం రికార్డ్ అనే చెప్పాలి. మహేష్ మూవీ రైట్స్ విషయంలో క్రియేట్ చేసిన రికార్డును ఇప్పట్లో మరో సినిమా బ్రేక్ చేసే ఛాన్స్ అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
సూపర్ స్టార్ మహేష్ బాబు భవిష్యత్తు సినిమాలపై సైతం మంచి అంచనాలు నెలకొన్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు రాజమౌళి కాంబో సినిమాలో ట్విస్టులు సైతం ఒకింత అసక్తికరంగా ఉండనున్నాయని తెలుస్తోంది. మహేష్ జక్కన్న కాంబో మూవీ 2000 కోట్ల రూపాయల బిజినెస్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు. మహేష్ బాబు క్రేజ్ అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
 
ఐదు పదుల వయస్సులో కూడా మహేష్ బాబుకు క్రేజ్ పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. రీ రిలీజ్ సినిమాలతో సైతం రికార్డులు క్రియేట్ చేయడం మహేష్ బాబుకే సాధ్యం అని చెప్పవచ్చు. మహేష్ బాబు రేంజ్ అంతకంతకూ పెరుగుతుండగా భవిష్యత్తు సినిమాలతో ఈ హీరో మరిన్ని క్రేజీ రికార్డులను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. మహేష్ రెమ్యునరేషన్ సైతం భారీ స్థాయిలో ఉంది. మహేష్ బాబును అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: