
ఇప్పుడు నేచురల్ స్టార్ నాని హీరోగా హిట్ 3 ప్రేక్షకులకు ముందుకు వచ్చింది. ఈ సినిమా ఇవాళ థియేటర్లలో రిలీజ్ అయింది. హీరో నాని అలాగే శ్రీనిధి శెట్టి... హీరో హీరోయిన్లుగా ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకుడు శైలేష్ కొలను. సినిమా థియేటర్లో రిలీజ్ కావడంతో జనాలు ఎగబడి ఈ సినిమాను చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే సినిమా చూసి వచ్చి బయట రివ్యూ కూడా చెప్పేస్తున్నారు.
ఇక ఈ సినిమా కొంతమంది బాగుందంటే మరి కొంత మంది అట్టర్ ఫ్లాప్ అయిందని కామెంట్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే.... నాని నటించిన హిట్ 3 మూవీ ప్లస్ పాయింట్స్ అలాగే మైనస్ పాయింట్స్... సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చాలామంది ఈ సినిమాకు 5 కు 2.75 రేటింగ్ ఇస్తున్నారు. ఈ సినిమాలో పాజిటివ్ పాయింట్స్ విషయానికి వస్తే... సినిమాలో నాని యాక్టింగ్ అదరహో అన్నట్లుగా ఉంటుందట. అలాగే స్టైలిష్ ప్యాకేజింగ్ బాగుందని చెబుతున్నారు.
డైలాగ్స్ అలాగే టైమింగ్స్ బాగున్నాయట. సినిమా ఆటోగ్రాఫీ ఈ సినిమాకు చాలా ప్లస్ అయిందని చెబుతున్నారు. అటు హీరోయిన్ శ్రీనిధి శెట్టి కూడా అద్భుతంగా నటించింది. దర్శకత్వం కూడా ఆ సినిమాకు ప్లస్ అయింది. ఈ సినిమాలో నెగటివ్ పాయింట్స్ విషయానికి వస్తే... చివర్లో కాస్త కథ స్లోగా నడిచింది. సస్పెన్స్.. పెద్దగా లేకపోవడం అని అంటున్నారు సినిమా అభిమానులు. గత రెండు పాటల కంటే ఇది పెద్దగా... లేదని కూడా కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా పైన మిక్స్డ్ టాక్ వస్తుంది.