రాజకీయ నాయకులు పోలీసులు తలుచుకుంటే చట్టాలను కూడా మార్చుకొని వారి చుట్టాలుగా చేయగలరని సుమన్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అనుకోని విధంగా హీరో సుమారు ఒక కేసులో ఇరికించి చివరికి తన జీవితమే నాశనం చేసే ప్రయత్నం చేశారు.. అయితే సుమన్ కెరియర్ పై దెబ్బకొట్టింది ఎవరు  దాని వెనుక ఎవరైనా సినీ ఇండస్ట్రీ వారు సపోర్ట్ చేశారా అనే వివరాలు చూద్దాం.. తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు సుమన్ మంచి స్థాయిలో ఎదిగారు. చూడటానికి అందం, అభినయం, మార్షల్ ఆర్ట్స్  అన్ని విధాలా టాలెంట్ ఉన్న సుమన్ ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో కొనసాగుతున్న సమయంలో  ఒక కేసులో అరెస్టు అయ్యాడు.. అయితే ఆయన అరెస్టు వెనుక చిరంజీవి ఉన్నాడని అప్పట్లో అనేక వార్తలు వినిపించాయి. సుమన్ జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత అసలు ఆయనను ఇరికించింది చిరంజీవి కాదని పోలీసులు రాజకీయ నాయకులు కలిసి ఇరికించారని అసలు విషయం తెలుసుకొని ఒక ఇంటర్వ్యూలో బయటపెట్టారు.

 సుమన్ తెలిపిన వివరాల ప్రకారం  ఆనాటి తమిళ ముఖ్యమంత్రి ఎంజీఆర్  మరియు డీజీపీ పన్ని నటువంటి ప్లాన్ లో భాగంగా సుమన్ అరెస్ట్ అయ్యారు. అయితే అప్పటి తమిళనాడు డిజిపి కూతురు సుమన్ ను చాలా ఇష్టపడిందట. దీంతో సుమన్ ను ఎలాగైనా ఇరికించాలని డిజిపి  ప్లాన్ చేసి ఆయనను కేసులో ఇరికించి జైల్లో వేశారు. అయితే ఆయనపై కేసు పూర్తిగా విచారణ కాకముందే చీకటి ఉండే సెల్ లో వేసి చిత్రహింసలు పెట్టారట. ఇక ఆయన జైలుకు వెళ్లిన సమయంలో  పలువురు సుమన్ ను ఇరికించింది ముఖ్యమంత్రి అండ్ డిజిపి అని తెలుసుకున్నారట.

అప్పట్లో సుమన్ మంచి పొజిషన్ లో ఉన్న హీరో కావడంతో ఆయన కోసం ప్రతిపక్ష నేత అయినటువంటి కరుణానిధి జైలుకు వెళ్లి మరి ఆయనపై ఉన్న కేసు పై చర్చ చేశారట. కేసు నిర్ధారణ కాకముందే చీకటి గదిలో ఎట్లా వేస్తారు అంటూ ప్రశ్నించారట. అలా సుమన్ ను సాధారణ జైలుకు తీసుకువచ్చి చివరికి ఆయన బయటకు వచ్చేలా సహకారం అందించారని చెప్పుకొచ్చారు. ఒకవేళ కరుణానిధి అక్కడికి రాకపోయి ఉంటే సుమన్ ఆ జైలు నుంచి శవంగానే  బయటికి వచ్చేవారని చెప్పుకొచ్చారు. అలా కొన్ని నెలల పాటు జైల్లో ఉండి బయటకు వచ్చిన సుమన్ ఆ తర్వాత తన కెరియర్ లో నిలబడడానికి చాలా ప్రయత్నాలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: