పాన్ ఇండియన్ స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ హీరో ఇప్పటివరకు ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఎన్నో బ్లాక్బస్టర్ హిట్ సినిమాలలో నటించిన ప్రభాస్ బాహుబలి సినిమాతో ఒక్కసారిగా పాన్ ఇండియన్ స్టార్ హీరోగా మారాడు. ఈ సినిమా అనంతరం బాహుబలి-2, కల్కి లాంటి అనేక సినిమాలు మంచి విజయాలను అందుకున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా చిత్రాలలో మాత్రమే నటిస్తున్నారు. ఈ హీరో ప్రస్తుతం వరసగా మూడు, నాలుగు సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్నారు. 


ప్రభాస్ నుంచి వస్తున్న తాజా చిత్రం స్పిరిట్. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా.... డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాను ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథ ఆధారంగా సినిమా తెరకెక్కుతోంది. ఇందులో ఇప్పటివరకు హీరోయిన్ ని ఫైనల్ చేయలేదు. కానీ కియారా అద్వానీ, త్రిష, రష్మిక మందన లాంటి అనేకమంది హీరోయిన్ల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇందులో ఏ హీరోయిన్ ప్రభాస్ సరసన హీరోయిన్ గా ఫైనల్ అవుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


ఈ క్రమంలోనే ఈ సినిమాలో మరో హీరోయిన్ పేరు తెరపైకి వచ్చింది. స్పిరిట్ సినిమాలో అనుష్క శెట్టికి కొన్ని కీలకపాత్రలలో నటించే అవకాశాన్ని ఇచ్చారట. అయితే ప్రభాస్, అనుష్క శెట్టి మధ్య వచ్చే సన్నివేశాలు సెకండ్ హాఫ్ లో ఉంటాయని అవి సినిమాకి ప్లస్ పాయింట్ అవుతాయని దర్శకుడు భావించారట. దీనికోసం అనుష్క శెట్టిని సంప్రదించగా ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా సమాచారం అందుతోంది.

గతంలో ప్రభాస్, అనుష్క శెట్టి కాంబినేషన్లో అనేక సినిమాలు తెరపైకి రాగా... అవన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో కొన్ని కీలక సన్నివేశాలను తీసినట్లైతే సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంటుందని చిత్ర యూనిట్ సభ్యులు భావిస్తున్నారట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను అనుష్క శెట్టితో కలిసి తీయబోతున్నారట. ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం వెలవడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: