టాలీవుడ్ స్టార్ హీరో బాలకృష్ణ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ, రేంజ్ పరంగా టాప్ లో ఉన్నారు. బాలయ్య అఖండ2 సినిమాకు ఏకంగా 35 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ అందుకుంటున్నారు. ఈ మొత్తం బాలయ్య కెరీర్ లో హైయెస్ట్ అనే సంగతి తెలిసిందే. అయితే బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీ రెమ్యునరేషన్ నెట్టింట ఒకింత సంచలనం అవుతోందనే చెప్పాలి.
 
బాలయ్య గోపీచంద్ మలినేని కాంబో మూవీ ఏకంగా 120 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని తెలుస్తోంది. ఈ సినిమాకు గోపీచంద్ మలినేని పారితోషికం 15 కోట్ల రూపాయలు అని భోగట్టా. రెమ్యునరేషన్ విషయంలో బాలయ్య ఇతర హీరోలకు భిన్నంగా మారిపోయారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. బాలయ్య లుక్స్ కు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. బాలయ్య సైతం తన సినిమాలకు సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
 
బాలయ్య సినిమాలు భవిష్యత్తులో కలెక్షన్ల విషయంలో మరిన్ని సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పాన్ ఇండియా స్థాయిలో బాలయ్య అద్భుతాలు చేస్తే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. బాలయ్య పారితోషికం అంతకంతకూ పెరుగుతుండటం అభిమానులకు ఎంతగానో ఆనందాన్ని కలిగిస్తుండటం గమనార్హం. బాలయయ్ కెరీర్ ప్లాన్స్ అద్భుతంగా ఉన్నాయి.
 
బాలయ్య వయస్సు 64 సంవత్సరాలు కాగా ఈ వయస్సులో కూడా ఎంతో కష్టపడుతున్నారు. బాలయ్యకు 2025 సంవత్సరంలో డాకు మహారాజ్ తో యావరేజ్ రిజల్ట్ ఎదురు కాగా అఖండ2 సినిమాతో ఎలాంటి రిజల్ట్ దక్కుతుందో చూడాల్సి ఉంది. బాలయ్య బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అద్భుతాలు చేయాలని ఫ్యాన్స్ ఫీలవుత్న్నారు. బాలయ్య సినిమాలలో నటించడానికి చాలామంది హీరోయిన్లు ఆసక్తి చూపిస్తుండటం గమనార్హం. స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ అభిమానులకు నచ్చే సినిమాలనే ఎంచుకుంటూ భారీ విజయాలను అందుకుంటూ వార్తల్లో నిలుస్తుండటం గమనార్హం. యంగ్ జనరేషన్ హీరోలకు సైతం బాలయ్య ఆదర్శంగా నిలుస్తున్నారు.






మరింత సమాచారం తెలుసుకోండి: