తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది మాత్రమే వారి సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంటారు. అలాంటి వారిలో ప్రముఖ నటి సమంత ఒకరు. ఏ మాయ చేసావే సినిమాతో ప్రతి ఒక్కరి మనసులను దోచుకుంది ఈ సుందరి. తన అందం, చలాకీతనం, నటనతో ప్రేక్షకుల మనసులను మాయ చేసింది. మొదటి సినిమాతోనే మంచి సక్సెస్ అందుకున్న ఈ చిన్నది ఆ సినిమా అనంతరం వరుసగా సినిమాలు చేసుకుంటూ అగ్ర హీరోయిన్ గా నిలిచింది  దాదాపు పది సంవత్సరాలకు పైనే ఈ చిన్నది తెలుగు సినీ పరిశ్రమను ఓ ఊపు ఊపేసిందని చెప్పవచ్చు.

సినిమాలలో తన కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న సమయంలోనే ప్రముఖ నటుడు నాగచైతన్యను ప్రేమించి వివాహం చేసుకుంది. అతి తక్కువ సమయంలోనే వీరిద్దరూ విడిపోయారు. విడాకుల అనంతరం నాగచైతన్య మరో వివాహం చేసుకున్నారు. సమంత సినిమాలో నటిస్తూ తన కెరీర్ కొనసాగిస్తుంది. ఇప్పుడు హీరోయిన్ గా మాత్రమే కాకుండా నిర్మాతగాను సమంత మారడం విశేషం. సామ్, చైతు కలిసి ఉన్న సమయంలో వీరిద్దరూ హాష్ అనే శునకాన్ని దత్తత తీసుకున్నారు. దానిని ఎంతో అపురూపంగా చూసుకునేవారు. వీరు విడిపోయినప్పటికీ హాష్ కు కో-పేరెంట్స్ గా ఉంటామని అనుకున్నారట. ఇన్ని రోజులపాటు సమంత వద్దే హాష్ ఉంది.


గత కొద్ది రోజుల క్రితం నాగచైతన్య వద్దకు హాష్ వెళ్ళింది. అక్కడ నాగచైతన్య భార్య శోభిత హాష్ తో వెనుక నుంచి ఓ ఫోటోను దిగి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఆ ఫోటో విపరీతంగా వైరల్ అయింది. సమంతను టార్గెట్ చేసి శోభిత అలా చేసిందని అనేక రకాల వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో సమంత తన హాష్ ను మళ్లీ తన వద్దకే తెచ్చుకుంది. దాంతో కలిసి సమంత ఓ ఫోటోని దిగి సోషల్ మీడియాలో షేర్ చేసుకోగా అది వైరల్ గా మారింది. సమంత చాలా క్యూట్ గా దానితో ఫోటోలు దిగి అభిమానులతో షేర్ చేసుకోగా అది వైరల్ గా మారింది.

శోభిత అలా చేసినందుకే సమంత వారికి కౌంటర్ ఇవ్వాలనే ఉద్దేశంతోనే అలా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో షేర్ చేసినట్లుగా అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదిలా ఉండగా.... ప్రస్తుతం సమంత శుభం సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకుంటుంది. ఈ సినిమా అనంతరం సమంత మరికొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించి మంచి సక్సెస్ అందుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: