వేణు స్వామి ..ఆయన చెప్పిందే నిజం అని భ్రమలో బ్రతికే జనాలు ఇప్పటికీ చాలామంది ఉన్నారు . వేణు స్వామి ఏది చెప్తే అది జరుగుతుంది అని వేణుస్వామి నోటి నుండి వచ్చిన మాట కచ్చితంగా జరుగుతుంది అని చాలామంది జనాలు అనుకుంటూ ఉంటారు . మరీ ముఖ్యంగా కొంతమంది టాప్ మోస్ట్ సెలబ్రిటీస్ కూడా ఆయన దగ్గరికి వెళ్లి ప్రత్యేకంగా పూజలు చేయించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి . స్టార్ హీరోయిన్స్ నిధి అగర్వాల్ , రష్మిక మందన్నా లాంటి బ్యూటీస్ ఆయన దగ్గర పూజలు చేయించుకొని లైఫ్ ని టర్న్ చేసుకున్నారు అంటూ వేరే హీరోయిన్స్ కూడా ఆయన దగ్గర పూజలు చేయించుకోవడానికి బాగా ట్రై చేశారు .

కాగా అదంతా ఒకప్పుడు మేటర్ నాగచైతన్య - సమంత విడిపోతారు అని చెప్పి ఆ టైం లో  హైలైట్ అయిన వేణు స్వామి ఆ తర్వాత ఆయన చెప్పిన జాతకాలు మొత్తం ఢమాల్ ఢమాల్ అంటూ రివర్స్ గా తిరిగిపోతూ ఉండడం .. ఆయనకు బ్యాడ్ టైం స్టార్ట్ అయ్యింది అని ప్రూవ్ చేసింది . కాగా నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల జాతకం పై చెప్పి మహిళా కమిషన్ చుట్టూ తిరిగి నానా తంటాలు పడిన వేణు స్వామి గొమ్మునే ఉండకుండా ట్రెండింగ్ లో ఉన్న టాపిక్ ఇండో-పాక్ వార్ పై జాతకం చెప్పారు . అయితే వేణు స్వామి జాతకం చెప్పిన మరొక క్షణం ఇండియా పాకిస్తాన్ వార్  ఆగిపోయింది .

దీంతో సోషల్ మీడియాలో హ్యుజ్ ట్రోలింగ్ ఎదుర్కొంటున్నాడు వేణు స్వామి . నరేంద్ర మోడీ ది వృశ్చిక రాశి అనురాధ నక్షత్రం అని.. పాక్ ప్రధాని ది మిధున రాశి అని వీళ్ళిద్దరికీ అస్సలు పడకుండా ఉండే పరిస్థితి ఉంది అని .. ఖచ్చితంగా యుద్ధం పీక్స్ స్థాయిలోకి వెళ్ళిపోతుంది అని .. మహాభారతం గొడవ భూమి కోసమేనని .. ఇప్పుడు కాశ్మీర్ అనే భూమి కోసం గొడవ మొదలైంది అని ..వేణు స్వామి తనదైన స్టైల్ తో రైమింగ్ తో టైమింగ్ తో ఇంట్రెస్టింగ్ గానే చెప్పుకొచ్చారు.  అయితే ఏ ముహూర్తం వేణు స్వామి గొడవ జరుగుతుంది వార్ పెద్దది అవుతుంది అంటూ చెప్పారో.. ఆ తర్వాత వెంటనే పాకిస్తాన్ - భారత్ యుద్ధం ఆపేస్తున్నట్లు ప్రకటించారు.

కాల్పుల విరమణ అమల్లోకి తీసుకొచ్చారు . ఇంకేముంది సోషల్ మీడియాలో వేణు స్వామి కి రకరకాల ట్యాగ్స్ ఇస్తున్నారు. "నువ్వు వేణు స్వామి కాదు దొంగ స్వామివి .. నువ్వు ఏది చెప్తే దానికి నెగిటివ్ గానే జరుగుతుంది " అంటూ వేణు స్వామిని దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు . వేణు స్వామికి అసలు జాతకాలు చూడడమే రాదు అని ఏదో తూ తూ మంత్రంగా నాలుగు రాళ్లు తగులుతూ వస్తున్నాయి అని .. అసలు ఇతగాడిని జాతకాలు చెప్పకుండా గవర్నమెంట్ బ్యాన్ చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు జనాలు..!
 

మరింత సమాచారం తెలుసుకోండి: