మొదటిసారి మైన అనే చిత్రంతో ఇండస్ట్రీకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది అమలాపాల్.. ఈ చిత్రంలో ఈమె నటనకు సైతం తమిళ్లు ఫిదా అవ్వడమే కాకుండా రాష్ట్ర ఉత్తమ నటిగా కూడా అవార్డుని అందుకోవడం జరిగింది అమలాపాల్. ఆ తర్వాత తెలుగులో ఇద్దరమ్మాయిలతో అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చి నాయక్ అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. అలా తెలుగులోనే కాకుండా తమిళ్ ,మలయాళం, కన్నడ వంటి భాషలలో కూడా నటించి బాగానే పేరు సంపాదించింది హీరోయిన్ అమలాపాల్.


అయితే అమలాపాల్ పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎన్నో వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. 2014లో ప్రముఖ  డైరెక్టర్ విజయ్ ను ప్రేమించి మరి వివాహం చేసుకోగా.. కేవలం మూడేళ్లకే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 2023లో జగత్  దేశాయ్ ని మళ్లీ ప్రేమించి వివాహం చేసుకున్నది. వీరికి ఒక మగ బిడ్డ కూడా జన్మించారు. ఇదంతా ఇలా ఉండగా ఇటీవలే జెఎఫ్ డబ్ల్యూ అవార్డు వేడుకలలో ఉత్తమ నటిగా అమలాపాల్ అవార్డు గెలుచుకోవడం జరిగింది.ఈ సందర్భంగా తన ప్రేమ పెళ్లి విషయం పైన పలు విషయాలను బయటపెట్టింది.


అమలాపాల్ మాట్లాడుతూ జగత్ ను తాను గోవాలో కలిశానని అతడు గుజరాతి అయినప్పటికీ కూడా గోవాలో సెటిల్ అయ్యారని తనది కేరళ అని వెల్లడించింది అమలాపాల్. జగత్ ఎక్కువగా దక్షిణాది సినిమాలు చూడడని తాను హీరోయిన్ అనే విషయాన్ని కూడా తెలియదని.. తాను ప్రెగ్నెంట్ అయిన తర్వాతే వివాహం చేసుకున్నానని ఆ తరువాతే తాను హీరోయిన్ అన్న విషయం తన భర్త జగత్ తో తెలియజేశానని తెలిపింది అమలాపాల్. ఆలా తాను ఇంట్లో ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో తన సినిమాలను ఒక్కొక్కటిగా చూపిస్తు తన భర్తతో కలిసి ఎంజాయ్ చేశానని అలాగే తాను అవార్డు తీసుకున్న ఫోటోలు వీడియోలు చూసి ఆనందపడ్డారని తెలిపింది అమలాపాల్.

మరింత సమాచారం తెలుసుకోండి: