
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా నటించిన తాజా సినిమా డాకు మహారాజ్. ఈ సంక్రాంతికి గట్టి పోటీ మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన డాకు మహారాజు సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ సినిమాతో బాలయ్య ఖాతాలో వరుసగా నాలుగో హిట్ సినిమా పడింది. బాలయ్య ఇటీవల నటించిన సినిమాలలో దర్శకుడు అనిల్ రావిపూడి తో చేసిన భగవంత్ కేసరి సినిమా కూడా ఒకటి. ఈ సినిమా కూడా పెద్ద హిట్గా నిలిచింది. ఈ సినిమానే ఇప్పుడు తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి రీమేక్ చేస్తున్నట్టుగా రూమర్లు వినిపిస్తున్నాయి. విజయ్ తాజాగా నటిస్తున్న జననాయగన్ సినిమా భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ అని ఎప్పటినుంచో టాక్ ఉంది. కానీ ఈ విషయం అధికారికంగా కన్ఫర్మ్ కాలేదు.
అయితే విజయ్తో దర్శకుడు హెచ్ వినోద్ మరో సినిమా చేస్తున్నాడని కూడా టాక్ వచ్చింది. కానీ లేటెస్ట్ గా ఓ లీక్ ఇప్పుడు సౌత్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. ఇందులో విజయ్ పోలీస్ గెటప్ లో కనిపించడంతో అభిమానులు ఎగ్జెట్ అవుతున్నారు. భగవంత్ కేసరి సినిమాలో కూడా బాలయ్య నార్మల్ వెర్షన్ తో పాటు పోలీస్ గెటప్ లుక్‌లో కూడా కనిపించారు. సో మళ్ళీ పోలీసులు మ్యాచ్ అయ్యేసరికి విజయ్ సినిమా భగవంత్ కేసరి సినిమాకు రీమేక్ అనే అంటున్నారు. ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు