
అయితే తాజాగా ఓ వార్త సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది. అదేంటని ఆలోచిస్తున్నారా.. మాస్ మహారాజ్ రవితేజ నటించిన భద్ర సినిమా నేటితో 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. దీంతో రవితేజ ఫాన్స్ ఆనందంలో మునిగిపోయారు. ఈ సినిమాలో గ్లామరస్ బ్యూటీ మీరా జాస్మిన్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు. ఈ సినిమా విడుదలై 20 ఏళ్లు అయినప్పటికీ.. ఈ సినిమా పై క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఈ సినిమా లవ్, యాక్షన్ తో పాటుగా మంచి ఎంటర్టైన్మెంట్ కూడా అందిస్తుంది. ఈ సూపర్ హిట్ మూవీకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించారు. ఈ సినిమా స్టోరీని మొదట జూనియర్ ఎన్టీఆర్ కి చెప్పారట. కానీ ఆయనకు డేట్స్ కుదరక ఈ మూవీని చేయలేనని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా హీరో రవితేజ చేసినట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఇకపోతే హీరో రవితేజ రీసెంట్ గా తీసిన మిస్టర్ బచ్చన్ సినిమా ప్లాప్ అయ్యింది. మాస్ మహారాజు కొత్త సినిమా 'మాస్ జాతర' నుండి అప్డేట్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో రవితేజకి జోడీగా శ్రీలీల నటిస్తుంది. ఈ సినిమాని భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. మాస్ మహారాజు సినిమాకు భీమ్స్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు నాగవంశీ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో మాస్ మహారాజు రవితేజ వింటేజ్ లుక్ లో కనిపిస్తారని మూవీ మేకర్స్ చెప్పారు. మాస్ జాతర సినిమా మంచి హిట్ కొట్టే సినిమా అవుతుందని తెలుస్తోంది.