ఈ వేసవి సెలవులలో ప్రేక్షకులను వినోదాన్ని పంచేందుకు ఒక సూపర్ హిట్ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లోకి రానుంది. మరి ఆ సినిమా ఏంటో.. ఏ ఓటీటీ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుందో ఓ లుక్కేదాం.. జాలీ ఓ జింఖానా సినిమా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా జనవరి నెలలో విడుదలైంది. కామెడీ ఎంటర్టైనర్ గా తెరపైకి వచ్చిన జాలీ ఓ జింఖానా సినిమా తమిళ ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమా ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను నవ్వించేందుకు సిద్ధం అయ్యింది. ఈ సినిమా ఇటీవలే ఓటీటీ ఫ్లాట్ ఫామ్ అయిన ఆహాలో రిలీజ్ అయింది.

 జాలీ ఓ జింఖానా మూవీకి డైరెక్టర్ శక్తి చిదంబరం దర్శకత్వం వహించారు. ఈ మూవీ చూసి హాయిగా అన్నీ మర్చిపోయి కాసేపు నవ్వుకొవ్వచ్చు. ఈ మూవీలో ప్రభుదేవా ప్రధాన పాత్రలో నటించారు. జాలీ ఓ జింఖానా మూవీ కోలీవుడ్ లో థియేటర్ లో రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. కానీ టాలీవుడ్ లో మాత్రం డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అయ్యింది. ఈ సినిమాలో నటి మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్ గా నటించింది. అభిరామి, యోగీబాబు, రెడిన్ కింగ్స్ ళీ ముఖ్యపాత్రలలో నటించారు.

ఈ మధ్యకాలంలో ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లలో చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులు కూడా కంటెంట్ బాగుంటే చూస్తున్నారు. కొన్ని సినిమాలు అయితే డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ అయ్యి మంచి సక్సెస్ ని అందుకుంటున్నాయి. సినీ ప్రియులకు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ లు వరంగా మారాయి అని చెప్పొచ్చు. ప్రతి వారం ఓటీటీలో కొత్త కొత్త సినిమాలు విడుదల అవుతూ.. ప్రేక్షకులను అలరిస్తున్నాయి.అటు తెలుగు, ఇటు హిందీతో పాటుగా కన్నడ, తమిళం, మలయాళం సినిమాలు కూడా అందుబాటులోకి వస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: