సినీ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ గురించి పరిచయం అనవసరం. ఈమె నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. అయితే కంగనా రనౌత్ మరోసారి వార్తల్లో నిలిచింది. తాజాగా నటి కంగనా, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇటీవల భారత్ లో యాపిల్ కంపెనీ పెట్టుబడులను ట్రంప్ అడ్డుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విషయంపై కంగనా రనౌత్ స్పందించింది. దీనికి సంబంధించిన ఒక పోస్ట్ ని ఆమె సోషల్ మీడియా వేదికగా పెట్టింది.
 
ఆ పోస్ట్ లో కంగనా మోదీని ఫాదర్ ఆఫ్ ఆల్ ఆల్ప మేల్స్ అంటూ తెలిపింది. ఆమె పెట్టిన పోస్ట్ లో ప్రధాని మోదీని, ట్రంప్ ని పొల్చింది. ఆ పోస్ట్ ని ఒక గంట తర్వాత తీసేసింది. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆ పోస్ట్ ని తొలగించమని ఆదేశించారని.. అందుకే వెంటనే పోస్ట్ ని డిలీట్ చేసిందని ఆమె స్పష్టం చేసింది.ఇక ఈ విషయం సోషల్ మీడియాలో తెగ చెక్కర్లు కొడుతుంది.


 ఇకపోతే కంగనా రనౌత్ ఒక బాలీవుడ్ స్టార్ హీరోయిన్. ఇటీవలే కంగనా రనౌత్ నటించిన ఎమర్జెన్సీ సినిమా ఓటీటీలో మంచి హిట్ కొట్టింది. బాక్స్ ఆఫీసు వద్ద బోల్తా కొట్టిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఈ సినిమా 1975 లో ఇండియా ఎమర్జెన్సీ విధించిన ఘటనల ఆధారంగా రూపొందింది. ఈ సినిమా ఒక హిస్టోరీకల్ సినిమా. కంగనా రనౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ ఏడాది జనవరిలో థియేటర్ లో విడుదల అయింది. ప్రేక్షకుల నుండి మంచి స్పందన రాక హిట్ కొట్టకపోవడంతో ఈ సినిమా ఓటీటీలోకి రావడానికి దాదాపు 2 నెలలు పట్టింది. ఈ సినిమా మార్చి 14 నుండి ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన నెట్ ప్లీక్స్ లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక ఈ సినిమా ఓటీటీ రిలీజ్ అయిన రెండు రోజుల్లోనే టాప్ వన్ లోకి వచ్చింది. ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి ఆదరణ సొంతం చేసుకుని మిలియన్ల వ్యూస్ ని సాధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: