పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే తెలియని వారుండారు. పవన్ కళ్యాణ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన సినిమా రిలీజ్ అయిందంటే చాలు ప్రేక్షకులకు పండుగ అనే చెప్పాలి. మరి ఆయనకు ఉన్న క్రేజ్ అలాంటిది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అటు సినిమాలతో.. ఇటు రాజకీయాలతో ఫుల్ బిజీ అయిపోయారు. అయితే తాజాగా ఒక వార్త చెక్కర్లు కొడుతుంది. సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతుంది. అది ఏంటో తెలుసుకుందాం.

ఇటీవల పవన్ ఓ మీటింగ్ కి హాజరయ్యారు. ఆ మీటింగ్ లో పవన్ కళ్యాణ్ చేతిపై పచ్చబొట్టు కనిపించింది. ఆయన చేతిపై ఉన్న టాటూ స్పెషల్ అట్రాక్షన్ గా అందరి దృష్టిని ఆకర్శించింది. చేతిపైన టాటూ కనిపించించడంతో చాలా ఊహగానాలు వెలువడ్డాయి. ఆ టాటూ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటని.. ఆ టాటూకి అర్థం ఏంటని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఓజీ సినిమా కోసమే పవన్ కళ్యాణ్ ఆ టాటూ వేయించుకున్నారని టాప్ వినిపిస్తోంది. టాటూ మీనింగ్ కూడా అదేనని తెలుస్తుంది. మరి ఆ పచ్చబొట్టు సినిమా కోసమే వేసుకున్నారా.. లేక ఇంకేదైనా ఉందా అనేది తెలియాల్సి ఉంది. 
 
ఇక పవన్ కల్యాణ్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రాల్లో 'OG' (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) మూవీ ఒకటి. ఈ సినిమాను యంగ్ డైరెక్టర్ సుజిత్ తెరకెక్కిస్తున్నాడు. ఈ మూవీ మాఫియా బ్యాగ్‌డ్రాప్‌తో రూపొందుతోంది. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. పవర్‌ఫుల్ యాక్షన్‌తో రాబోతున్న 'OG'  సినిమాను rrr ప్రొడ్యూసర్ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ఎస్ థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ కి జోడీగా ప్రియాంక మోహన్ నటిస్తోంది. అలాగే, అర్జున్ దాస్, ప్రకాశ్ రాజ్, శ్రీయా రెడ్డి సహా ఎంతో మంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: