టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది యాంకర్లు ఉన్నారు. అందులో కొంతమంది మాత్రమే మంచి గుర్తింపు సంపాదించుకుంటారు. అలాంటి వారిలో ప్రముఖ యాంకర్ శ్రీముఖి ఒకరు. పటాస్ షో ద్వారా తన కెరీర్ ప్రారంభించిన శ్రీముఖి ప్రస్తుతం వరుసగా షోలలో యాంకరింగ్ చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంటుంది. యాంకర్ గా మాత్రమే కాకుండా సినిమాలలోనూ నటిస్తూ తన హవాను కొనసాగిస్తోంది. సినిమాలు, షోలలో ఎప్పుడూ బిజీగా ఉండే శ్రీముఖి తనకు సమయం దొరికినప్పుడల్లా వెకేషన్స్ కి వెళుతూ ఉంటుంది.

 
అక్కడ ఎంజాయ్ చేస్తూ సందడి చేస్తోంది. ఈ క్రమంలోనే శ్రీముఖి తాజాగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుమలలో దర్శనం చేసుకొని బయటకు వస్తున్న సమయంలో శ్రీముఖి కొన్ని ఫోటోలను తీసుకున్నారు. ఆ ఫోటోలను తన ఇన్ స్టాలో షేర్ చేసుకోగా అందులో ఓ ఫోటో చర్చనీయాంశంగా మారింది. అందులో ఓ ఫోటోను గమనించినట్లయితే శ్రీముఖి కాలి వేళ్ళల్లో బొటనవేలు కన్నా పక్కన వేలు పొడవుగా ఉంది. బొటనవేలు కన్నా పక్కన వేలు పొడవుగా ఉండడం మంచిది కాదని సాముద్రిక శాస్త్రం చెబుతోంది.

అలా ఉన్నవారు వారి జీవితంలో ఎన్నో ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కొంటారని ఆర్థికపరమైన సమస్యలు అధికంగా వస్తాయని జ్యోతిష్య శాస్త్రంలో వెళ్లడైంది. తాను వివాహం చేసుకున్న భర్త కూడా అనేక రకాల సమస్యలను, ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందట. తనకు బొటనవేలు కన్నా పక్కన వేలు పొడవుగా ఉండడం వల్లనే ఇండస్ట్రీలో పెద్దగా గుర్తింపు రావడం లేదని అంటున్నారు.

ఎన్నో షోలలో యాంకరింగ్ చేసినప్పటికీ పెద్దగా సక్సెస్ సాధించలేకపోతోంది అని అంటున్నారు. అయితే వీరు ఆత్మగౌరవానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనే సత్తా వారికి ఉంటుందని చెబుతున్నారు. ప్రస్తుతం శ్రీముఖికి సంబంధించిన ఈ వార్త సోషల్ మీడియా మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారుతోంది. దీనిపై శ్రీముఖి ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: