- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

పెండింగ్లో ఉన్న మూడు సినిమాలు పూర్తి చేసి ఆ తర్వాత రాజకీయాల్లో ఫుల్ బిజీ అవ్వాలని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఇది నిజంగా పవన్ అభిమానులకు ఫుల్ మీల్స్ లాంటిదే. ఈ ఏడాది హరిహర వీరమల్లు - ఓజి సినిమాలు వచ్చేస్తాయి. వచ్చే ఏడాది ఉస్తాది భగత్ సింగ్ సినిమా వస్తుంది. కానీ ఆ తర్వాత ఏమిటి ? పవన్‌ మనసులో ఏముంది ? ఉస్తాదః భగత్ సింగ్ సినిమా చేసి ఇక సినిమాలు ఆపేయాలని అనుకుంటున్నారా ? పూర్తిస్థాయిలో రాజకీయాలకు అంకితం అవ్వాలని అనుకుంటున్నారా ? అంటే అవును అన్న ఆన్సర్లు జనసేన వర్గాల నుంచి వినిపిస్తున్నాయి. పవన్ 2029 ఎన్నికలు టార్గెట్గా సక్సెస్ కావాలి అనుకుంటే కొన్నాళ్లపాటు హైదరాబాద్కు , సినిమాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నారట.


కీల‌క శాఖ‌ల‌కు మంత్రి పదవిలో బాధ్యతలు నిర్వహణ , పార్టీ వ్యవహారాలు , జనంలోకి వెళ్ళటం ఇలాంటి వాటికి పూర్తి సమయం కేటాయించాలని అనుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోని సినిమాలుకు ఇక గుడ్ బై చెప్పేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తిగా సినిమాలకు గుడ్ బై చెప్పేయటం ఉస్తాద్‌ భగత్ సింగ్ సినిమా పూర్తి చేసి పూర్తిగా రాజకీయాల్లోకి ఉండటం ఒక ఆలోచన కాగా .. మంచి సబ్జెక్టు దొరికితే దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చే ఎన్నికలకు ముందు మరో సినిమా చేసే ఆలోచనలో కూడా పవన్ ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ కేంద్రంలో కీలకపాత్ర పోషించడానికి వెళితే ఇక సినిమాలు చేయటం కుదరదు. ఏది ఏమైనా ఉస్తాద్‌ భగత్ సింగ్ పవర్ స్టార్ ఆఖరి సినిమా అన్న ప్రచారం గట్టిగా జరుగుతోంది.


వాట్సాప్ నెంబ‌ర్‌కు మీ జిల్లాలో రాజ‌కీయ‌, సామాజిక స‌మ‌స్య‌లు వివ‌రాలు పంపండి..

ఏపీ, తెలంగాణ‌లో వివిధ నియోజ‌క‌వ‌ర్గాల్లో నెల‌కొన్న ప్ర‌జ‌ల స‌మ‌స్య‌లు, రాజ‌కీయ ప‌ర‌మైన అంశాల‌ను మా దృష్టికి తీసుకు రావాల‌నుకుంటున్నారా ?  మీ స‌మ‌స్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబ‌రుకు వాట్సాప్ ద్వారా తెలియ‌జేయండి.

నోట్ :  వ్య‌క్తిగ‌త స‌మ‌స్య‌లు వ‌ద్దు

మరింత సమాచారం తెలుసుకోండి: