టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చాలా కాలం క్రితం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు అనే సినిమాను మొదలు పెట్టిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో నీది అగర్వాల్ హీరోయిన్గా నటించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఏ ఏం రత్నం ఈ మూవీ ని నిర్మించాడు. ఈ సినిమా ప్రారంభం అయ్యాక అనేక సార్లు ఈ మూవీ షూటింగ్ ఆగిపోవడంతో ఈ మూవీ దర్శకత్వ బాధ్యతల నుండి క్రిష్ జాగర్లమూడి తప్పుకున్నాడు. దానితో రూల్స్ రంజన్ మూవీ దర్శకుడు అయినటువంటి జ్యోతి కృష్ణ ఈ సినిమా యొక్క దర్శకత్వ బాధ్యతలను స్వీకరించాడు. జ్యోతి కృష్ణ ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేశాడు.

ఈ మూవీవ్ని జూన్ 12 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ అప్డేట్ను ప్రకటించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన గ్రాండ్ ప్రెస్ మీట్ ను మే 21 వ తేదీన ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ బృందం వారు మే 21 వ తేదీన నిర్వహించనున్న గ్రాండ్ ప్రెస్ మీట్ లో ఈ సినిమాకు సంబంధించిన అనేక విషయాలను తెలియజేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతానికి ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ సినిమా ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: